Politics

అంబానీ కోడలు ధరించిన డ్రస్ ఖరీదు ఎంతో తెలుసా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముఖేష్ కుమారుడు ఆకాష్ అంబానీకి తన చిన్ననాటి స్నేహితురాలయిన శ్లోకా మెహతాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ నెల 24 న గోవాలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబానీ, శ్లోకా కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. తన కాబోయే కోడలికి ముకేష్ అంబానీ ఆప్యాయంగా స్వీట్లు తినిపిస్తున్న ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. వజ్రాల కంపెనీ రోజీ బ్లూ ఇండియా అధినేత రసెల్ మెహతా కుమార్తె ఇప్పుడు భారతీయ కుబేరుడు అంబానీ ఇంటి కోడలిగా అడుగుపెడుతోంది.

వీరి పెళ్లి విషయం పక్కన పెడితే.. మరో విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.ఇంతకీ అదేంటో తెలుసా..? ఎంగేజ్ మెంట్ లో శ్లోకా మెహతా ధరించిన డ్రస్. మీరు చదివింది నిజమే. ఇప్పుడు చర్చంతా శ్లోకా ధరించిన డ్రస్ గురించే. నిన్న ఎంగేజ్ మెంట్ లో కాబోయ్ వరుడు ఆకాశ్ సహా.. అతని కుటుంబసభ్యులంతా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా సాధారణంగా దుస్తులు ధరించడం విశేషం. దీంతో అందరి కళ్లు శ్లోకా డ్రస్ మీద పడ్డాయి.

ఇటీవల జరిగిన ఐఫా అవార్డు కార్యక్రమంలో అచ్చం ఇలాంటి డ్రస్.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ వేసుకుంది. అలియా బ్లాక్ కలర్ డ్రస్ వేసుకోగా.. అచ్చుగుద్దినట్టు అదే డ్రస్.. కాకపోతే కలర్ మార్పు.. డ్రస్ ని శ్లోకా వేసుకుంది. ఇంతకీ డ్రస్ ధర ఎంతో తెలుసా..? రూ.80,500 మాత్రమే(875 పౌండ్లు) లండన్ కి చెందిన ఓ డిజైనర్ దీనిని డిజైన్ చేశారు. మరో విషయం ఏమిటంటే.. అంత డబ్బు ఉన్న కుటుంబంలో పుట్టి కూడా అందరూ సాధారణ దుస్తులు ధరించడాన్ని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.