Movies

సమంత, చైతూల పెళ్లి ఈ టాలీవుడ్ హీరో రిసార్ట్ లోనే జరిగింది…ఎవరా హీరో ? తెలిస్తే షాక్ అవుతారు

టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య, సమంతలు తమ ప్రేమను పెళ్లితో సుఖాంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వాళ్ల వివాహం గోవాలోని ఓ ప్రయివేట్ రిసార్ట్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు. తన పెద్దకొడుకు పెళ్లి కాబట్టి అక్కినేని నాగార్జున ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుని గ్రాండ్ గా ఆర్గనైజ్ చేశాడు. అయితే, వీళ్ల పెళ్లికి సంబంధించి చిన్న ఫుటేజ్ కూడా లీక్ కాలేదంటే ఆ పెళ్లికి వేదికగా నిలిచిన రిసార్ట్ ఎంత పకడ్బందీగా ఉంటుందో ఈజీగా చెప్పేయవచ్చు.గోవాలోని వెగాటోర్ బీచ్ లో ఉన్న డబ్ల్యూ రిసార్ట్ అక్కినేని వారి పెళ్లికి ఆతిథ్యమిచ్చింది. అప్పట్లో ఈ రిసార్ట్ ఎవరిదో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ, ఇప్పుడు దాని గురించి అసలు విషయం తెలిసేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ రిసార్ట్ టాలీవుడ్ యువ హీరో సచిన్ జోషికి చెందినదని తెలుస్తోంది.

సాధారణంగా గోవాలో ఏదైనా ఫంక్షన్ చేయాలనుకుంటే సెలబ్రిటీలు ఫస్ట్ ప్రయారిటి ఇచ్చేది సచిన్ జోషికి చెందిన డబ్ల్యూ రిసార్ట్ కే. ఎందుకంటే ఇక్కడ దొరికే ప్రైవసీ సెలబ్రిటీలను బాగా ఇంప్రెస్ చేస్తుంది. అనుమతి లేకుండా మానవమాత్రుడెవరూ లోపలికి అడుగుపెట్టలేరు. ముఖ్యంగా మీడియా పట్ల ఇక్కడి సిబ్బంది చాలా కచ్చితంగా వ్యవహరిస్తారు. తమకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటికి పొక్కదన్న నమ్మకం చూపిస్తారు కాబట్టే సెలబ్రిటీలకు కావాల్సిన రిసార్ట్ గా పేరుతెచ్చుకుంది.

ఇక దీని యజమాని సచిన్ జోషి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఆయన హీరోగా కంటే ముందు ఓ కుబేరుడు అని చెప్పుకోవాలి. జేఎంజే గ్రూప్ అధినేత జగదీష్ జోషి కుమారుడు. గుట్కా, హోటల్స్, స్పాలు, రిసార్ట్ లు, ఐటీ కంపెనీలు, స్కూళ్లు, లిక్కర్, ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్.. ఇలా సచిన్ జోషికి చాలా వ్యాపారాలున్నాయని చెబుతారు. ముంబయి బిజినెస్ వరల్డ్ లో సచిన్ జోషిని గుట్కా కింగ్ అని పిలుచుకుంటారు. ఏడాదికి వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఆయన కంపెనీల సొంతం!

సచిన్ జోషి వద్ద ఆడి, జాగ్వార్, హమ్మర్ వంటి ఖరీదైన కార్లు కొలువుదీరి ఉంటాయి. అయితే ఈ యువ హీరోలో మానవతా దృక్పథం మెండుగా ఉంది. తన ఆదాయంలో 5 శాతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికోసం ఉదారంగా ఖర్చు చేస్తుంటాడు. అంతేకాదు, సినిమాలకు ఫైనాన్స్ చేయడం కూడా సచిన్ జోషి ఆసక్తి చూపించే అంశాల్లో ఒకటి. గతంలో టాలీవుడ్ లో ఇలాగే నిర్మాత బండ్ల గణేష్ చిత్రాలకు ఫైనాన్స్ చేయడం తెలిసిందే. అయితే అది వివాదాలకు దారితీయడంతో కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చినా పెద్దగా పట్టించుకోకుండా వదిలేశాడట సచిన్ జోషి.

అయితే అన్నీ ఉన్నా ఈ యువహీరోకు మాత్రం టాలీవుడ్ లో పెద్దగా హిట్లేవీ లేవు. అటు బాలీవుడ్ లో కొన్ని ప్రాజక్టులు చేసినా అవి కూడా అంతంతమాత్రంగానే ఆడాయి. వెజిటేరియన్ లైఫ్ స్టయిల్ ను ఇష్టపడే ఈ బిజినెస్ హీరో మూగజీవాలకు వ్యతిరేకంగా పోరాడే పెటాకు గట్టి మద్దతుదారుడిగా పేరు తెచ్చుకున్నాడు.