Politics

కర్ణాటక CM కుమారస్వామి భార్య టాప్ హీరోయిన్ అని మీకు తెలుసా?

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. బలనిరూపణ ముంగిట బీజేపీ నేత యడ్యూరప్ప సీఎంగా రాజీనామా చేయడంతో జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఆయన సీఎం అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది.
ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆయన ముఖ్యమంత్రి కావడం పట్ల కుటుంబ సభ్యుల్లో ఆనందం అంబరాన్నంటుతోంది. ముఖ్యంగా కుమారస్వామి సతీమణి రాధిక ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.కుమారస్వామి ఏరికోరి పెళ్లిచేసుకున్న రాధిక ఒకప్పటి ప్రముఖ హీరోయిన్. 2002లో వచ్చిన నీల మేఘ శ్యామ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.

ఆ తర్వాత కొద్దికాలంలోనే కన్నడనాట అగ్రహీరోల చిత్రాల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. 9వ తరగతిలో ఉన్నప్పుడు రాధిక రతన్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లాడి ఆపై విడిపోయింది. మొదటి పెళ్లి జరిగే సమయానికి ఆమె వయస్సు 14 ఏళ్లే.అయితే తమ కుమార్తె మైనర్ అని చెప్పి రాధికను ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు.

ఆ తర్వాత 2002లో రతన్ కుమార్ హార్ట్ అటాక్ తో చనిపోయాడు. రాధిక కన్నడలోనే కాదు తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. 2004లో వచ్చిన భద్రాద్రి రాముడు చిత్రంలో తారకరత్న పక్కన అందాలు ఆరబోసింది. 2014లో సత్యప్రకాష్ లీడ్ రోల్ పోషించిన అవతారం సినిమాలో నటించింది.

అదే సమయంలో కుమారస్వామి కూడా వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ దశలో రాధికతో పరిచయం ప్రేమగా మారడం, అది పెళ్లికి దారితీయడం జరిగింది. మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుమారుడైన కుమారస్వామికి మొదట్లో రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి ఉండేదికాదు. సినిమా రంగంలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ ప్రొడ్యూసర్ గా అనేక బ్లాక్ బస్టర్లు నిర్మించారు. ఆయన నిర్మాతగా వచ్చిన చంద్ర చకోరి అనే చిత్రం కర్ణాటకలో 365 రోజులు ప్రదర్శితమైంది.

చిత్రరంగంలో ఉన్నప్పుడు 2005లో ఆయనకు రాధిక పరిచయం అయింది. ఇద్దరి పరిస్థితులు ఒకేలా ఉండడంతో వాళ్ల మధ్య అనుబంధం కొద్దికాలంలోనే మరింత బలపడింది. అయితే మొదటి భార్య అనితకు విడాకులు ఇవ్వకుండానే రాధికను రెండో పెళ్లిచేసుకుని సంచలనం సృష్టించారు కుమారస్వామి. రాధిక తన వయసుకంటే రెట్టింపు వయస్కుడిని పెళ్లిచేసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

పెళ్లినాటికి రాధిక వయసు 20 ఏళ్లు కాగా, కుమారస్వామి వయసు 47 సంవత్సరాలు.వారిద్దరికీ షమిక అనే కుమార్తె ఉంది. అయితే పెళ్లి తర్వాత కొన్ని సినిమాలకు రాధిక ప్రొడ్యూసర్ గా వ్యవహరించి కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది.