Politics

పవన్ సేంట్ మెంట్ యాత్రలో ఈ రెండు గమనించారా?

పవన్ కళ్యాణ్ లో పట్టుదల ఎక్కువ. మూఢనమ్మకాలు అంటే అసలు నమ్మరు. సినిమాల్లో ఉన్నప్పుడు కూడా తన సినిమాల్లో సేంట్ మెంట్ ను చూపించవద్దని తన దర్శకులకు చెప్పేవారు. కానీ రాజకీయాల్లో వచ్చాక మాత్రం ఒక సిద్ధాంతి చెప్పినట్టు సేంట్ మెంట్ కి ప్రాధాన్యం ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ప్రతి రోజు తెల్లని వస్త్రాలను ధరిస్తున్న పవన్,ఒక్క రోజు మాత్రం పవన్ కళ్యాణ్ గ్రీన్ కలర్ జాకెట్,జీన్స్ ప్యాంట్ వేసుకొని హీరోగా మారిపోయాడు. ఇలా పవన్ కళ్యాణ్ గ్రీన్ కలర్ షర్ట్ వేయటం వెనక వేరే కారణం ఉందట. తెల్లని దుస్తులను ధరించటం మంచిదే అయినా ఎప్పుడు ధవళ వర్ణం వేసుకోవటం మంచిది కాదని ఒక సిద్ధాంతి ఆ మధ్య పవన్ కి చెప్పాడట.

అందుకే అప్పటి నుంచి పవన్ అడపా దడపా తన దుస్తులను చేంజ్ చేయాలనీ భావించాడట. పవన్ చేతికి కనక పుష్యరాగం ఉంగరం ఎప్పుడు కన్పిస్తూ ఉంటుంది. ఆ ఉంగరం కూడా ఆ సిద్ధాంతే ఇచ్చాడట. దీని వల్ల రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాలను నెరవేరుతాయని సిద్ధాంతి చెప్పాడట. అటు రంగు ఇటు ఉంగరం రెండు కలిసి పవన్ ని CM ని చేస్తాయేమో చూడాలి.