Politics

కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ కొడుకు హఠాన్మరణం వెనుక దాగివున్న కారణం ఇదే..

21ఏళ్లకే నిండు నూరేళ్లు నిండాయి.. నవయవ్వనంతో దూసుకుపోవాల్సిన వయసుకు మృత్యువు కళ్లెం వేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా స్వర్గదారులకు మళ్లించింది.. కేంద్ర మాజీ మంత్రి , బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో మృతిచెందాడు.
వైష్ణవ్ వయసు 21 సంవత్సరాలు మాత్రమే కావడం.. మంగళవారం రాత్రి వైష్ణవ్ కు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో హుటాహుటిన ముషీరాబాద్ లోని గురునానక్ కేర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వైష్ణవ్ అర్ధరాత్రి సమయంలో మృతిచెందారు.. ఈ ఘటనతో దత్తాత్రేయ కుటుంబంలో విషాదం నెలకొంది.నిజానికి వైష్ణవ్ ది చనిపోయేంత వయసు కాదు.. అంత చిన్న వయసులో గుండెపోటు ఎలా వచ్చిందో తెలియదు..

ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న వైష్ణవ్ మృతితో దత్తాత్రేయ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో కన్నీరుమున్నీరు అవుతున్నారు. వారిని ఓదార్చడం ఎవ్వరి తరం కావడం లేదు.. ఇంత చిన్న వయసులో తమను వదిలి వెళతాడని కలలో కూడా ఊహించలేదని దత్తాత్రేయతో పాటు ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

కాగా గుండెపోటు అనేది సన్నగా ఉన్నారా.. లావుగా ఉన్నారా అన్నది ముఖ్యం కాదని.. అతిగా కొవ్వు పదార్థాలు తీసుకునే వాళ్లలో కొవ్వు పేరుకుపోయి రక్తనాళల్లో చిక్కుకొని గుండెపోటుకు కారణమవుతుందని.. 30 ఏళ్లు లోపు వారికి వచ్చే గుండెపోటు తీవ్రంగా ఉంటుందని.. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు.. ఇదే వైష్ణవ్ మరణానికి కారణం అదే అని వైద్యులు తేల్చారు.