వైఎస్సార్ బయోపిక్ లో “జగన్” సోదరి “షర్మిల” గా నటించే టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
మహి రాఘవ్ డైరెక్షన్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. అయితే ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా ఇటీవల రిలీజ్ అయి వైఎస్సార్ అభిమానులను ఆకట్టుకుంది.ఈ సినిమాలో వైఎస్ తనయుడు జగన్ పాత్రలో స్టార్ హీరో సూర్య నటించనున్నారని వార్త బయటకు వచ్చింది. అయితే సూర్య ఈ పాత్రలో నటించడం అనేది చాలా మంచి విషయమని కానీ తాము ఇంతవరకూ సూర్యను అప్రోచ్ అవలేదని మహి తెలిపారు. ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే ఓ కీలక పాత్రలో పోసాని కృష్ణమురళి నటిస్తున్నారని మహి వెల్లడించారు.
పోసానిది ఓ కల్పిత పాత్ర అని కానీ ఈ పాత్ర చాలా ఇంపార్టెంట్ అని మహి స్పష్టం చేశారు.అంతేకాదు వైఎస్ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
పవన్ కళ్యాణ్ సరసన ఖుషీ చిత్రంలో నటించి …ఆ తర్వాత సినిమాలకు దూరమైన… భూమిక మళ్లీ నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాలో వదిన పాత్రలో నటించింది. ప్రస్తుతం సమంత- ఆది పినిశెట్టి కాంబినేషన్‌లో రూపొందుతున్న యూటర్న్ చిత్రంలో నటిస్తోంది. అంతే కాదు దివంగత సీఎం YSR బయోపిక్‌లోను భూమిక నటిస్తోందనిసమాచారం.