Movies

హైపర్ ఆది ఎవరి కొడుకో తెలుసా.? బయటపడ్డ షాకింగ్ నిజం..! ఎవరో తెలుస్తే..?

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి. యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు.జబర్ధస్త్ నుంచి సినిమాల వరకు సాగిన ఆది ప్రయాణంలో ఒడిదుడుకులు ఎన్నో ఉన్నాయి. జబర్ధస్త్ లోకి రావడానికి ఆది అష్టకష్టాలు పడ్డాడు. ఓ మారుమూల పల్లెనుంచి హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చిన ఆది విజయాల వెనుక కళ్లు చెమర్చే కథ ఉంది.

హైపర్ ఆది పుట్టింది పెరిగింది ప్రకాషం జిల్లా చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామం. తల్లిదండ్రులు కోటనరసింహం, శారదలు.. వీరిది రైతుకుటుంబం.. 8వ తరగతి వరకు పల్లామల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. 9,10 తరగతులు మద్దిపాడు నాగార్జున స్కూలులో.. ఇంటర్ పేర్నమిట్ట శ్రీచైతన్యలో విధ్యనభ్యసించాడు. బీటెక్ ప్రకాషం ఇంజినీరింగ్ కాలేజీలో పూర్తి చేశాడు..

ప్రకాషం జిల్లాలో ఇంజనీరింగ్ పూర్తికాగానే ఆది ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. ఫ్రెండ్స్ తో రూంలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సమయంలోనే అత్తారింటికి దారేది మూవీ చూసి ఆ సినిమా క్లైమాక్స్ ను పేరడి వీడియో ఓ పార్కులో తీసి యూట్యూబ్ లో పెట్టాడు. అది చూసిన జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి చాలా బాగుందని.. తన జబర్ధస్త్ షోలకు స్ర్రిప్ట్ రాయాలని కోరాడు.

దీంతో అలా జబర్తస్త్ లో చాలా స్ర్కిప్ట్ లు రాశాడు. జబర్ధస్త్ దర్శకులు నితిన్, భరత్ లు ఆదిని స్క్రిప్ట్ రాయడంతోపాటు స్వయంగా నటించాలని కోరడంతో అభి టీంలో కంటెస్టెంట్ గా చేరాడు. అది క్లిక్ కావడంతో టీం లీడర్ గా అవకాశం వచ్చింది. అలా ఆది పవర్ ఫుల్ స్కిట్ లతో ఇప్పుడు జబర్ధస్త్ లోనే నంబర్ 1 కమెడియన్ గా రూపొందారు.
Haiper Aadi
ప్రస్తుతం స్క్రిప్ట్ రైటర్ గా.. కమెడియన్ గా ఆది దూసుకుపోతున్నాడు.. తనకు సినిమాల్లో చిరంజీవి స్ఫూర్తి అని.. పవన్ కళ్యాణ్ ఆరాధ్యుడని చెబుతుంటాడు ఆది.. అందుకే వారిని ఎవరు తిట్టినా వారితో కయ్యానికి కాలుదువ్వుతాడు.. మొన్నీ మద్యే కత్తి మహేష్-ఆది ఫైట్ చూశాం. ఇలా ఓ మారుమూల పల్లె నుంచి కమెడియన్ గా అంచలంచెలుగా ఎదిగాడు ఆది..