Politics

ఫస్ట్ టైం జనసేనపై అదిరిపోయే పంచ్ వేసిన హైపర్ ఆది.. చూస్తే షాకే..!

తెలుగు టెలివిజన్ షోలలో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతున్న షోలలో జబర్దస్త్ కూడా ఒకటి.. దాదాపుగా ఐదేళ్లకు పైగా ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.. అప్పుడప్పుడు కొన్ని వివాదాలు వస్తున్నా.. ఆడియెన్స్ దీనిని చూడటం మాత్రం ఆపలేదు.. మొదట జబర్దస్త్ గా మొదలైన ఈ షో.. అశేష ఆదరణతో.. ఎక్స్ట్రా జబర్దస్త్ గా మరో రోజు కూడా వస్తుంది.. ఇక అసలు విషయానికొస్తే, వచ్చే వారం టెలికాస్ట్ కాబోతున్న ఎపిసోడ్ కి సంబంధించి ఓ ప్రోమో విడుదల చేశారు.. అందులో ఎప్పట్లా ఆది తన పంచులతో అలరించాడు.. అనసూయ ఐ లవ్ యూ అంటూ తన స్కిట్ స్టార్ట్ చేసిన ఆది ఎప్పటిలాగానే రాజకీయానికి సంబంధించి తనదైన శైలిలో అదిరిపోయే పంచు వేశాడు.

స్కిట్ లో భాగంగా శాంతి స్వరూప్, మహిళ వేషంలో వచ్చి.. ఆది నేను వచ్చేశా అంటుంది. దానికి ఆది బదులిస్తూ.. నువ్వు వచ్చేసా అనగానే చేర్చుకోవడానికి, నాది ఆ పార్టీ , ఈ పార్టీ కాదు జబర్డస్త్ పార్టీ అని బదిలిస్తాడు. వెంటనే శాంతి స్వరూప్.. నీ జబర్డస్త్ పార్టీకి అనుభవం ఉందా అని అడగ్గా.. మరి బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడిన అనుభవం లేదు గాని, చిన్నపాటి అనుభవమైతే ఉంది అని ఆది అనడంతో.. నాగబాబు, రోజాలతో సహా అందరూ నవ్వేశారు.

ఆది పవన్ అభిమాని అన్న సంగతి తెలిసిందే.. అతని స్కిట్స్ లో పవన్ ని కీర్తిస్తూ డైలాగులు కూడా ఉంటాయి.. తాజాగా పవన్ కి ఏమాత్రం అనుభవం లేదని విమర్శలు వస్తున్న తరుణంలో.. ఆది, ఈ రకమైన డైలాగ్ చెప్పి పవన్ పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు..

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."