Movies

అనసూయకు భర్త రెండు ప్రమాణాలు…17 ఏళ్ల నాటి అపూర్వ సంఘటన

బుల్లితెర యాంకరింగ్ కి గ్లామర్ తీసుకువచ్చింది ఖచ్చితంగా అనసూయ అనే చెప్పాలి. అనసూయ బుల్లితెర మీద మంచి పాపులారిటీ సంపాదించిన తర్వాత వెండితెరపై దృష్టి పెట్టింది. సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఏరి కోరి ఎంచుకొని ముందుకు సాగుతుంది. రాంచరణ్,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్తగా మంచి నటనను కనబరచటంతో వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. అనసూయ ఆలా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా మంచి పాత్రలను కంగారు పడకుండా నిదానంగా ఎంచుకుంటుంది. ప్రస్తుతం అనసూయ కుటుంబంతో కలిసి మాల్దీవ్ లలో ఉంది.

అనసూయ తన ఎనిమిదొవ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవటానికి భర్త,కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ వెళ్ళింది. ఈ సందర్భంగా అనసూయ తన భర్త శశాంక్ భరద్వాజ్ ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది.

ప్రేమ గురించి,అన్యోన్యంగా ఉండటం గురించి,చిన్న చిన్న లోపాలను అర్ధం చేసుకోవటం గురించి 17 సంవత్సరాల క్రితం నాకు ప్రామిస్ చేసావు. అప్పుడు నేను మాత్రమే ఉన్నాను. 8 సంవత్సరాల క్రితం ఇదే రోజు నా కోసం వీటి గురించి ప్రపంచానికి ప్రామిస్ చేసావ్. HAPPY 8 LOVE అంటూ అనసూయ ట్వీట్ చేసింది.
Anasuya

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."