Politics

చాణక్య చంద్రబాబు.. 2019 ఎన్నికల బరి లో చక్రం తిప్పేదెలా..

ఇప్పటి దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలలో ఏ పార్టీ గెలిచినా, కేంద్రం లో అధికారం లో ఉన్న పార్టీ తో సఖ్యత లేకపోయినా అంత ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడ్డాక, రాష్ట్రం లోని అధికారపార్టీ కు, కేంద్రం లోని అధికారపార్టీ తో సఖ్యతతో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేక హోదా గాని లేక ప్రత్యేక పాకేజీ గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊపిరి.. అనే ఈ పరిస్థితి లో, 2019 ఎన్నికలలో కేంద్రం లో గెలిచే పార్టీ తో సఖ్యత గా ఉండే పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గెలవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులలో కేంద్రం లో ఏ పార్టీ అధికారం చేపట్టినా, అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఏ పార్టీ కు సరైన మెజారిటీ రాకపోతే, రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడవచ్చు.

ఇలాంటి పరిస్థితులలో కేంద్రం లో అధికారం చేపట్టిన పార్టీ, రాష్ట్రం లో తమ పార్టీ బలపడేందుకు కృషి చేస్తుంది. కాంగ్రెస్, బీజేపీ లకు ఈ పరిస్థితి కలసివచ్చే అంశం. కాంగ్రెస్ ఇప్పటికే తమ పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయిందనీ, కేంద్రం లో అధికారం చేపడితే, ఆంధ్రప్రదేశ్ కు తప్పక ప్రాముఖ్యత ఇస్తామని ఇప్పటికే ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రం లో అధికారం కోసం, చంద్రబాబు మద్దతు ను ఆశిస్తోంది కాంగ్రెస్.

కెసిఆర్.. కాంగ్రెస్, బీజేపీ లకు, ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తుంటే, చంద్రబాబు మాత్రం దేశం లోని ఇతర ప్రాంతీయ పార్టీ నేతలు తో కలసి, బీజేపీ ను ఎదుర్కోడానికి కాంగ్రెస్ తో కూడిన కూటమి దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితులలో, రాష్ట్రం లో తెలుగుదేశం, కేంద్రం లో కాంగ్రెస్ అధికారం చేపడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు.

కేంద్రం తో సఖ్యతగా ఉండాలని గుర్తెరిగిన జగన్, కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ ను పెద్దగా విమర్శించడం లేదు. 2019 లో, రాష్ట్రం లో జగన్ పార్టీ గెలిచి, కేంద్రం లో బీజేపీ గెలిస్తే, ఇబ్బంది ఉండకూడదని జగన్ భావన.

ఇదివరకు కేంద్రం లో కాంగ్రెస్ అధికారం లో ఉన్నపుడే.., ఆ పార్టీ అధినాయకత్వం తో సఖ్యత గా లేక ఇబ్బందులు పాలైన జగన్, మరి ఈసారి తాను రాష్ట్రం లో, కాంగ్రెస్ కేంద్రం లో అధికారం చేపడితే, ఆ పార్టీ తో సఖ్యతగా ఉండగలడా.. అలానే, ఇదే ప్రశ్న చంద్రబాబు, బీజేపీ లకు కూడా వర్తిస్తుంది. ఏమైనా, ఎలాఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలివిగానే వ్యవహరిస్తారు.