Movies

మహేష్ బాబు గడ్డం, మీసాల వెనుక పవన్ కళ్యాణ్.. షాకింగ్ నిజాలు..

భరత్ అనే నేను మూవీ సక్సెస్ తో ప్రస్తుతం మహేష్ బాబు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అంతకుముందు రెండు ఫ్లాపులు ఇచ్చిన మహేష్ తాజాగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో మరో కొత్త మూవీకి రెడీ అవుతున్నారు. మహేష్ బాబు కోసం ఓ రాయలసీమ మాస్ మసాలా కథ ను దర్శకుడు పైడిపల్లి వంశీ రాయడంతో ఆ పాత్ర కోసమే మహేష్ రఫ్ లుక్ కోసం గడ్డం పెంచినట్టు వార్తలు వస్తున్నాయి..వంశీ పైడిపల్లి గత సినిమా ఊపిరి కూడా ఓ ఫ్రాన్స్ సినిమా స్ఫూర్తిగా తీసుకొని తీసిందే.. ఆ సినిమాలోని సెంటిమెంట్స్ ను బాగా చూపించి వంశీ హిట్ కొట్టించాడు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు కోసం సిద్ధం చేసిన కథ కూడా కాపీనే అని రూమర్స్ బయటకు వస్తున్నాయి.

మొదట్లో ఈ మూవీ కథ ఆస్ట్రేలియన్ టీవీ సిరీస్ కోసం ఒక న్యూజిలాండ్ రచయిత రాసిన కథను దర్శకుడు వంశీ కాపీ కొట్టాడని వార్తలు వచ్చాయి.. అయితే తాజాగా ఈ వార్తలను ఖండించిన వంశీ తాను మహేష్ కోసం సొంతంగా కథను తయారు చేశానని స్పష్టం చేశాడు.

ఈ కథను విన్న వంశీ సన్నిహితుల నుంచి లీక్ అయిన సమాచారం ప్రకారం మహేష్ బాబు తో తీయబోయే మూవీ కథ స్పానిష్ భాషలో నిర్మించిన ‘మోటార్ సైకిల్ డైరీస్’ను పోలి ఉంటుందని చెబుతున్నారు. 2004లో విప్లవ వీరుడు ‘చేగువేరా’ జీవితంపై బయోపిక్ గా వచ్చిన ఈ స్పానిష్ మూవీలోని కొన్ని కీలక సన్నివేశాలను యథాతథంగా వంశీ పైడిపల్లి మహేష్ సినిమాలో వాడుతున్నట్టు టాక్.

అయితే చేగువురే అంటే పవన్ కళ్యాణ్ కు పిచ్చి అభిమానం.. ఈ కమ్యూనిస్టు యోధుడిని చాలా సినిమాల్లో పవన్ వాడేశాడు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఆ కమ్యూనిస్టు యోధుడి కథలోనే ఇముడుతుండడంతో చేగువేరా పోలికల కోసమే గడ్డం, మీసాలు పెంచినట్టు వార్త బయటకు వచ్చింది.

శ్రీమంతుడు సినిమాలో మేసేజ్ ఇచ్చి హిట్ కొట్టిన మహేష్ బాబు.. ఆ తర్వాత ఇప్పుడు భరత్ అనే నేనులో కూడా సోషల్ మేసేజ్ ఇచ్చాడు. ఇప్పుడు వంశీ పైడిపల్లి మూవీ కూడా సోషల్ మెసేజ్ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అందుకే చేగువురేలా కనిపించేందుకు సిరియస్ లుక్ కోసం మహేష్ బాబు గడ్డం పెంచినట్టు తెలిసింది.