Movies

ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఏంతో తెలుసా? అది ఎవరు ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

కొన్ని రోజుల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజును తన సన్నిహితుల మధ్య చాలా ఆనందంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా అరవింద సమేత వీర రాఘవ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ సినిమా ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతుంది. అరవింద సమేత వీర రాఘవ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఈ స్పందన చూసి ఎన్టీఆర్ చాలా ఆనందపడ్డారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ చాలా ఖరీదైన వాచ్ ని బహుమతిగా ఇచ్చాడు. ఆ వాచ్ ఖరీదు దాదాపుగా కోటి రూపాయిలు ఉంటుందనే కధనాలు మీడియాలో వచ్చాయి.

ఈ కధనంపై కళ్యాణ్ రామ్ ఆలస్యంగా స్పందించాడు. జూనియర్ కి వాచ్ బహుమతిగా ఇచ్చిన మాట వాస్తవమే….అయితే ఆ వాచ్ అంత ఖరీదైనది కాదని చెప్పాడు. అంతే కాకుండా అందరు అనుకొనే విధంగా ఆ వాచ్ ని విదేశాలలో కొనలేదని, హైదరాబాద్ లోనే ఒక లగ్జరీ వాచ్ షాప్ లో చాలా సేపు వెతికి జూనియర్ కోసం ఆ వాచ్ కొన్నానని చెప్పుకొచ్చాడు.

ఆ వాచ్ ధర లక్షల్లో ఉంటే అభిమానులు ఎక్కువగా ఉహించుకొని కోటి రూపాయిల వాచ్ గా మార్చేశారని చెప్పాడు. అన్నదమ్ముల అనుబంధానికి కోట్ల రూపాయలతో ముడి వేయటం ఏమిటని ఎదురు ప్రశ్నించాడు. గత నెలలో జరిగిన పుట్టినరోజు గురించి ఇంత ఆలస్యంగా కళ్యాణ్ రామ్ ఎందుకు స్పందించాడో ఎవరికీ అర్ధం కాలేదు.