Movies

ప్రభాస్ పెళ్లిపై అనుష్క తల్లి సీరియస్….ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

బాహుబలి విడుదల అయ్యాక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,అనుష్క పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు జాతీయ మీడియాలో హల్ చల్ చేసాయి. దాంతో ప్రభాస్,అనుష్క పెళ్లి వార్తపై సందర్భం వచ్చిన ప్రతి సారి క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్య ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడేసరికి మరల జాతీయ మీడియా ప్రభాస్ పెళ్లి వార్తలపై ఫోకస్ పెట్టింది. ప్రభాస్ వున్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి అనేది వ్యక్తిగత విషయం,అందరికి చెప్పాల్సిన అవసరం లేదని, పెళ్లి కుదిరాక అన్ని విషయాలు చెపుతానని అన్నాడు.

ఈ లోపు ప్రభాస్ కి భీమవరంనకు చెందిన విద్యాసంస్థల అధినేత కూతురితో పెళ్లి కుదిరిందనే వార్తలు హల్ చల్ చేసాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా అనుష్క తో రూమర్స్ వదిలించుకోవడానికి ఈ స్టేట్ మెంట్ ఇచ్చి ఉంటాడని అంటున్నారు.

ఇప్పుడు అనుష్క తల్లి స్పందించటం మీడియాలో సంచలనంగా మారింది. ప్రభాస్,అనుష్క ఇద్దరు స్టార్స్. వారి నిర్ణయాలు వారు తీసుకోగలరని మీడియాపై ఫైర్ అయింది అనుష్క తల్లి. అనుష్క పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదు. అనుష్క,ప్రభాస్ పెళ్లి అంటూ కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాయి.

ప్రభాస్ లాంటి స్టార్ హీరో మా స్వీటీకి భర్తగా రావటం ఎంతో అదృష్టమని చెప్పింది. కానీ అనుష్క తో ప్రభాస్ పెళ్లి గురించి ఆమె కొట్టిపారేయలేదు. మొన్న ప్రభాస్ స్పందించటం,ఇప్పుడు అనుష్క తల్లి స్పందించటం చూస్తూ ఉంటే ఎదో తెర వెనక జరుగుతున్నట్టు అనిపిస్తుంది.