Movies

సాహో తర్వాత ప్రభాస్ సంచలన నిర్ణయం ….. షాక్ లో అభిమానులు

బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రభాస్ ఇప్పుడు మాట మార్చాడు. ప్రస్తుతం చేస్తున్న సాహో సినిమా కూడా దుబాయ్ లో పూర్తి కానున్నది. అయినా పెళ్లి గురించి ఏమి మాట్లాడటం లేదు ప్రభాస్. ప్రభాస్ అనుష్కతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని,పెదనాన్న కృష్ణంరాజు,
తల్లి ఒప్పుకోకపోవడంతోనే పెళ్లి చేసుకోవటం లేదని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ప్రభాస్ దుబాయిలో మీడియా సంస్ధలతో మాట్లాడుతూ ఒక బాంబు లాంటి వార్త ఒకటి చెప్పాడు. సాహో సినిమాకి సంబందించిన విషయాలను చెప్పిన ప్రభాస్ ని సాహో సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు సంచలన విషయాన్ని చెప్పాడు.

సాహో సినిమా తర్వాత వ్యాపారం లేదా వ్యవసాయం ఏదైనా చేయవచ్చని మీడియాతో చెప్పాడు ప్రభాస్. దీనితో సాహో సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు దూరం కానున్నాడని అర్ధం అయింది. అయితే ఈ మాటలను సరదాగా అన్నాడా… లేదా సీరియస్ గా అన్నాడా అనేది హాట్ టాపిక్ గా మారింది.

సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ పాత్ర కీలకమైనదని, తన పాత్ర కేవలం పాటలకే అపరిమితం కాదని, సినిమా ఆమె పాత్రతోనే ప్రారంభం అవుతుందని చెప్పారు ప్రభాస్. బాహుబలి సినిమా నచ్చిన వారికీ సాహో సినిమా కూడా నచ్చుతుందని తెలిపారు.

సాహో తర్వాత కూడా పెళ్లి చేసుకోనని చెప్పటం,ఇంట్లో ఎంత ఒత్తిడి ఉన్నా పెళ్ళి చేసుకోవటానికి ముందుకి రాకపోవటం,పవన్ తరహాలో సినిమాలకు దూరం అవుతానని ప్రకటించటం ద్వారా టాలీవుడ్ కి పెద్ద షాక్ ఇచ్చాడు ప్రభాస్.

ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకోవటానికి ఇంటిలోని వారు ఒప్పుకోకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక అసలు విషయాలు బయటకు రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."