Movies

నువ్వు డాడీతో రావద్దు…. ఇంటిలో ఉండు….అకిరా సంచలన నిర్ణయం

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. తన కార్యకలాపాలను నేరుగా ప్రజలలోంచి చేయటానికి విజయవాడలో నివాసం ఏర్పరుచుకున్నారు. నిన్న శుక్రవారం పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజెనోవా,పెద్ద కొడుకు అకిరాతో కలిసి అద్దె ఇంటిలోకి ప్రవేశించాడు. పవన్ ఇంకా ఎక్కువగా విజయవాడలో ఉంటాడని తెలిసి అభిమానులు సంబరపడ్డారు. రేణు,పవన్ ల కొడుకు అకిరా చాలా యాక్టివ్ గా కన్పించాడు. పవన్ తో అకిరాను చూసేసరికి అందరికి ఆశ్చర్యం కలిగింది. అయితే పవన్ కంటికి ఆపరేషన్ చేయించుకుంటాడని తోడుగా సాయంగా ఉండటానికి అకిరా వచ్చాడు.

హోటల్ గదిలో తన పిన్ని అన్నా లెజినోవా పాలు తాగే చంటి బిడ్డతో అవస్థలు పడుతున్న వైనాన్ని చుసిన అకిరా తండ్రి వెంట హాస్పిటల్ కి తాను తోడుగా వెళతానని అన్నా లెజినోవాను హోటల్ లోనే ఉండమని చెప్పాడట. అంతేకాక పవన్,అన్నా లెజినోవాకు పుట్టిన ఈ బిడ్డను ఎత్తుకొని ముద్దాడటం చుసిన జనసేన వర్గాలు చాలా ఆనందపడ్డాయి.

అన్నా లెజినోవా అకిరాను చూసి ఆశ్చర్యపోయి పవన్ గుణాలన్నీ ఉన్నాయని పవన్ అసిస్టెంట్స్ తో చెప్పిందట. అకిరా కూడా పవన్ లాగా మితభాషి. అలాగే ఎప్పుడు పుస్తకాలు చదువుతూ కనిపించటంతో అందరు దీని గురించే చర్చించుకుంటున్నారు.

పూణేలో రేణు దేశాయ్ దగ్గర ఉండే అకిరా ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన పిన్ని అన్నా లెజినోవా దగ్గరే ఉంటాడని మెగా ఫ్యామిలీ వర్గాలు అంటున్నాయి. అన్నా రష్యాలో తన బంధువుల దగ్గర నుండి కొన్ని పుస్తకాలను తెప్పించి అకిరాకు కానుకగా ఇచ్చిందట. విజయవాడలో అకిరా చేతిలో ఉన్న పుస్తకం అన్నా ఇచ్చినదే అని సమాచారం. ఈ పరిణామం పట్ల పవన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."