Movies

నా కొడుకుని అందుకు పంపించలేదు….రేణు దేశాయ్ ఫైర్

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అయన పెద్దకొడుకు అకిరా నందన్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటో చూసి పవన్ అభిమానులు వారసుడు వచ్చాడని సంబరపడుతున్నారు. ఆ ఫొటోలో అకిరా చేతిలో పుస్తకం ఉండటంతో తన తండ్రి వలె అకిరా కూడా పుస్తకాలను చదవటం చిన్నతనం నుండే అలవాటు చేసుకుంటున్నాడని అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. అకిరా పవన్ వారసుడిగా ఇక్కడే ఉండిపోతాడా అని రేణు దేశాయ్ కి మెసేజ్ లు పెడుతున్నారట. ఈ విషయం రేణు దేశాయ్ కి చాలా చిరాకును తెప్పించింది. అందుకే రేణు దేశాయ్ ట్వీట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చేసింది.

అకిరా తన స్కూల్ హాలిడేస్ ని తన తండ్రితో గడపటానికి వెళ్ళాడు. అంతేకాని హైదరాబాద్ లో ఉండిపోడు. నిన్న కళ్యాణ్ గారితో అకీరాను చూసినప్పటి నుంచి నాకు చాలా మెసేజ్ లు వస్తున్నాయని దానికి క్లారిటీ ఇవ్వటానికే ఈ ట్వీట్ చేస్తున్నానని చెప్పింది రేణు.

నిన్న శుక్రవారం పవన్ కళ్యాణ్ విజయవాడలో అద్దె ఇంటికి తన భార్య అన్నా జెనిలోవా, పెద్ద కొడుకు అకిరాతో కలిసి గృహప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దాంతో రేణుని నెటిజన్లు ఇక అకిరా హైదరాబాద్ లోనే ఉండిపోతాడా లేక పూణే వచ్చేస్తాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించటంతో రేణు క్లారిటీ ఇచ్చింది.

అకిరా కేవలం సెలవులను గడపటానికి మాత్రమే తండ్రి వద్దకు వెళ్లాడని సెలవులు అయ్యిపోయాక తిరిగి పూణే వచ్చేస్తాడని క్లారిటీ ఇచ్చింది.