Movies

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టిన నూతన నాయుడు

బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం అయ్యి రెండు వారాలు పూర్తి అయ్యింది. మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలో చాలా మార్పులే జరిగి కాస్త ఇంటరెస్టింగ్ కలిగించింది. ఇక మొదటి వారంలో ఎలిమినేషన్ సంజన కాగా,రెండో వారంలో ఎలిమినేషన్ నూతన్ నాయుడు అయ్యాడు. ఎలిమినేషన్ అయిన వీరిద్దరూ కూడా సామాన్యులే. రెండో వారం ఎలిమినేట్ అయిన నూతన 2నాయుడు బయటకు వచ్చాక ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. నూతన్ నాయుడు ని మీకు ఎంత పారితోషికం ఇచ్చారని అడిగితే నాకు ఏమి ఇవ్వలేదని చెప్పాడు. బిగ్ బాస్ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు బ్యాంకు డీటెయిల్స్ అన్ని అడిగారు. అన్ని ఇచ్చాను. అయితే నాకు పారితోషికం వద్దని నాకు అవకాశం ఇస్తే చాలని చెప్పానని నూతన్ నాయుడు అంటున్నారు.

అలాగే ఎగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కూడా డబ్బుకి సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదని చెప్పాడు. అంతేకాక సంజన ఎలిమినేట్ అయ్యాక ఆమె గురించి ఎటువంటి చర్చ జరగలేదని, అలాగే సంజన గురించి చర్చ ప్రారంభం అయిందని అనిపిస్తే నేనే పక్కకు వెళ్లిపోయేవాడినని చెప్పాడు నూతన్ నాయుడు.

మొదటి వారం కాస్త ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నానని,రెండో వారం సెటిల్ అయ్యానని అనుకున్నా…అయితే ఎలిమినేటి అయ్యిపోయాను. దేనికైనా కాలం కలిసిరావాలని అన్నాడు.

అంతేకాక బిగ్ బాస్ యాజమాన్యం నూతన్ నాయుడుకి మంచి అవకాశం ఇచ్చింది. అది ఏమిటంటే… బిగ్ బాస్ సీజన్ 3 కి నూతన్ నాయుడు సలహాలు,సూచనలు తీసుకుంటూ దానిలో భాగం చేస్తానని మాట ఇచ్చారట. అలాగే నూతన్ నాయుడు కూడా సెలక్షన్ నుంచి మీకు అందుబాటులో ఉంది సాయం చేస్తానని చెప్పారట.