Movies

అమిత్ కెప్టెన్ కావటానికి ముందు తర్వాత ఎలా ఉన్నాడో చూస్తే షాక్ అవుతారు

బిగ్ బాస్ ప్రారంభం అయ్యి 15 రోజులు గడిచిపోయింది. 16 వ రోజు సోమవారం షో చాలా లేజిగా ప్రారంభం అయింది. శనివారం,ఆదివారం అంతకు ముందు వారాలు టాస్క్ లతో బిజీగా గడిపిన ఇంటి సభ్యులు సోమవారం కాస్త రిలాక్స్ గా గడిపారు. శుక్రవారం వరకు జరిగిన రచ్చను మర్చిపోయి అందరూ హ్యాపీగా గడిపారు. అందరూ కలిసిపోయి సారిలు చెప్పుకున్నారు. కిరీటి తాను చేసిన తప్పుకు కౌశల్ కి సారి చెప్పాడు. తనీష్ కూడా కౌశల్ కి హగ్ ఇచ్చి గొడవలు మర్చిపోదామని చెప్పాడు. మొదటి వారం కెప్టెన్ అయినా సామ్రాట్ తనదైన ముద్రను వేయలేకపోయారు. తనీష్,తేజస్వి ఏమి చెప్పితే అదే చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే సామ్రాట్ డమ్మీ కెప్టెన్ గా వ్యవహరించాడు.

రెండో వారం కెప్టెన్ గా ఉండటానికి కౌశల్,అమిత్,తనీష్ హోరాహోరీగా పోరాటం చేసారు. ఈ క్రమంలోనే కిరీటి చేసిన రచ్చ గొడవకు దారి తీసింది. కిరీటి కౌశల్ ని టార్గెట్ చేసి పనులతో అందరి ఆగ్రహానికి గురిఅయ్యాడు.

దాంతో కిరీటి వైఖరి నచ్చక అందరూ ఎలిమినేషన్ కి నామినేట్ చేసేసారు. సోమవారం ఎలిమినేషన్ లో ఉన్నవారిని బిగ్ బాస్ ప్రకటించారు. హౌస్ లో భారంగా ఉంటున్న గణేష్,కిరీటి,భాను శ్రీ,తేజస్వి,గీతా మాధురి ఉన్నట్టు చెప్పారు.
ఈ ఐదుగురిలో ఒకరు ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్ళటం ఖాయం.

ఆ ప్రెస్టేషన్ లో భాను శ్రీ నందినితో గొడవ పెట్టుకుంది. ఈ గొడవ చాల పెద్దగానే జరిగింది. భాను శ్రీ చాలా రెచ్చిపోవటంతో జేజస్వి,దీప్తి,గీతా మాధురి శాంతింప చేసారు. నందిని కూడా ఎక్కడ తగ్గలేదు.

ఈ సమయంలోనే అమిత్ నాయకత్వ లక్షణాలను చూపించాడు. అమిత్ చాకచక్యంగా వ్యవహరించి భాను శ్రీని కూల్ చేసాడు. అమిత్ భాను శ్రీ దగ్గరకు వెళ్లి అక్కా అక్కా గొడవ చేయకు… ఈ వారం నేనే కెప్టెన్… బిగ్ బాస్ నన్ను అంటాడు. అంటూ చిన్నపిల్లవాడిలా భాను శ్రీ కాళ్ళను పట్టుకోవటంతో భానుశ్రీ నవ్వేసింది. దాంతో కెప్టెన్ గా అమిత్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. గొడవ మరీ పెద్దది కాకుండా అమిత్ వ్యవహారాన్ని డీల్ చేసాడు.