Movies

చిరంజీవి తల్లి అంజనాదేవి ఎవరి ఇంటిలో ఉంటుందో తెలుసా?

మెగా ఫ్యామిలీలో అందరూ హీరోలే. చిరంజీవి,నాగబాబు,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ ఇలా అందరు హీరోలుగా వచ్చి స్టార్ డమ్ ని సంపాదించుకున్నవారే. నాగబాబు టివి నటుడు మరియు సినిమా నిర్మాతగా సెటిల్ అయ్యాడు. చిరంజీవి మెగాస్టార్ గా ఈ రేంజ్ కి రావటానికి చాలా కష్టపడ్డాడు. చిరంజీవి వేసిన పునాదితోనే మెగా హీరోలందరూ వచ్చి ఒక స్థాయికి ఎదిగారు. చిరుకి అమ్మ అంటే చాలా ఇష్టం. నాన్న వెంకట్రావు చాలా సీరియస్ గా ఉంటే అమ్మ ద్వారా అన్ని పనులను చేయించుకునేవారు. మెగా బ్రదర్స్ లో తల్లి అంజనాదేవికి చిన్న కొడుకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమట. పవన్ మూడీగా,సిగ్గరిగా ఉండటం చూసి అంజనాదేవి పవన్ ని చిరు దగ్గరకు పంపి హీరోగా సహ్యమని కోరిందట.

తల్లి కోరిక మేరకు పవన్ పవర్ స్టార్ గా ఎదిగాడు. కొడుకుల ఎదుగుదలను చూసి తల్లి అంజనాదేవి మురిసిపోతుంది. చిరు రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాను హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య ధియేటర్ లో చూసి మురిసిపోయింది అంజనాదేవి. అయితే మెగా బ్రదర్స్ తల్లి అంజనాదేవి ఎక్కడ ఉంటున్నారనే విషయం చాలా మందికి తెలియదు.

తండ్రి ఉండేటప్పుడు నగర శివార్లలో ఉన్న చిరు ఫామ్ హౌస్ లో ఉండేవారట. తండ్రి చనిపోయాక తల్లిని చిరు చాలా రోజులవరకు తన వద్దే ఉంచుకున్నాడు. అప్పుడప్పుడు పవన్ ఇంటికి వెళ్లి వస్తుండేది.

ఇప్పుడు మాత్రం అంజనాదేవి నాగబాబు ఇంటిలో ఉంటుందట. నాగబాబు టీవీ రంగంలో బిజీగా ఉండటం,వరుణ్,నిహారికలు సినిమాల్లో బిజీగా ఉండటం వలన ఇంటిలో కోడలు ఒక్కతే ఉంటుందని తెలిసి అంజనాదేవి నాగబాబు ఇంటిలో ఉంటుందట.