Movies

ప్రశ్నించిన స్నేహితులకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రేణు..!!

త్వరలోనే తను పెళ్లి చేసుకోబోతున్నట్టు పరోక్షంగా వెల్లడించింది రేణుదేశాయ్. తన కాబోయే భర్త ఎవరు, అతడి ఫొటో లాంటి వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే కాబోయే భర్త వివరాల్ని వెల్లడిస్తుందని అంతా ఎదురుచూస్తున్న టైమ్ లో మరో బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది రేణుదేశాయ్. . ఈసారి ఏకంగా తన నిశ్చితార్థం ఫొటోను పోస్ట్ చేసింది. తనకు ఎంగేజ్ మెంట్ పూర్తయిందనే విషయాన్ని స్వయంగా వెల్లడించింది. అయితే ఈసారి కూడా తన కాబోయే భర్త ఎవరనే విషయాన్ని రేణుదేశాయ్ వెల్లడించలేదు. ఆమె స్పీడ్ చూస్తుంటే త్వరలోనే సీక్రెట్ గా పెళ్లాడి, ఆ మేటర్ ను కూడా ఇలానే సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుందేమో. బహుశా పెళ్లి తర్వాత రేణుదేశాయ్ తన భర్త వివరాల్ని బయటపెట్టొచ్చు. అయితే ఈ కార్యక్రమంలో రేణుదేశాయ్ పిల్లలు అకిరా, ఆధ్య కూడా పాల్గొన్నారు.

ఎట్టకేలకు రేణు దేశాయ్ తన రెండవ వివాహం గురించి ఓ జాతీయ పత్రికతో స్పందించారు. తాను చేసుకోబోతున్నది పెద్దలు కుదిర్చిన వివాహమే అని రేణు దేశాయ్ తెలిపింది. దీనిపట్ల తాను సంతోషంగా ఉన్నపటికీ జీవితంలో ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే జరుగుతుందని రేణుదేశాయ్ తెలిపింది.వివాహ తేదీ, వేదిక ఇంకా ఖరారు కాలేదని రేణు తెలిపింది.

కొంత మంది తనకు ఇచ్చిన సలహాతో తాను విభేదించానని రేణు తెలిపింది. ఈ సమయంలో వివాహం ఎందుకు అని చాలా మంది స్నేహితులు ప్రశ్నించారని రేణు తెలిపింది. రేణుకు కాబోయే భర్త బాగా సంపాదిస్తున్నారు. రేణు కూడా సంపాదిస్తోంది. ఇద్దరూ సహజీవనం ఎందుకు చేయకూడదు అని తన సన్నిహితులు సలహా ఇచ్చారని రేణు తెలిపింది.

కానీ తనకు వివాహం పైనే నమ్మకం అని తెలిపింది.గతంలో తాను సహజీవనం చేసానని రేణుదేశాయ్ తెలిపింది. కానీ ఆ సమయంలో నాకు ఛాయిస్ లేదు. మరోమారు సహజీవనం చేయాలనీ తాను భావించడం లేదు. 37 ఏళ్ల వయసున్న తనకు సాంప్రదాయాలపై నమ్మకం ఉందని తెలిపింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."