Movies

ఇంటిలో ప్రభాస్ ఎలా ఉంటాడో…నిజస్వరూపం బయట పెట్టిన కృష్ణంరాజు

తెరమీద వెలిగిపోయే హీరోలు తమతమ ఇళ్లల్లో ఎలా వుంటారో అందరూ తెలుసుకోవాలని ఉత్సాహపడతారు. అందుకే ఇంట్లో వాళ్ళు చెప్పే మాటలపై అభిమానులు ఆసక్తి చూపుతారు. తాజాగా బాహుబలి ప్రభాస్ తీరు గురించి అతని పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు చెప్పిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి. టాలీవుడ్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ఎవరంటే, ప్రభాస్ అని ఈజీగా చెప్పేయచ్చు. అందుకే ఇతని పెళ్లి గురించి వార్తలు ఆసక్తికరంగా ఉంటాయి. బుద్ధిమంతుడిగా పెద్దలు చేసిన పెళ్లి చేసుకుంటాడా?ప్రేమ పెళ్లి వైపు మొగ్గుచూపుతాడా అని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. దీనికి తోడు అనుష్కతో ఎఫైర్ గురించి కూడా జోరుగా వార్తలు గుప్పుమంటున్నాయి.

అందుకే రెబల్ స్టార్ కృష్ణం రాజు ఏమిచేయలేక నలిగిపోతున్నారని ఇండస్ట్రీలో పెద్ద టాక్. ఎందుకంటే, ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడడిగినా ఏదోకటి చెప్పి వాయిదా వేస్తున్నాడని కృష్ణం రాజు అంటున్నాడు. ఇక ప్రభాస్ పెళ్లి గురించి సీరియస్ గా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని లేటెస్ట్ గా కృష్ణంరాజు స్పందించాడు. ‘ప్రభాస్ ఏమైనా పాలు తాగే పిల్లాడు కాదు కదా.

పెళ్లి గురించి చెబితే చేసుకుంటానని అంటాడు తప్ప, ఎప్పుడు చేసుకుంటాడో చెప్పాడు. ఇప్పటికే 30ఏళ్ళు మీద పడ్డాయి. ఇక త్వరగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభాసే”అని కృష్ణం రాజు కొంత అసహనంగా వ్యాఖ్యానించాడు. ‘పిల్లలకు ఐదేళ్లు వచ్చే వరకూ దేవుడిలా చూడాలి, 18ఏళ్ళు వచ్చేవరకూ బానిసలా చూడాలి. ఆతర్వాత ఓ ఫ్రెండ్ లా ట్రీట్ చేయాలి.

ఈ విధానం మా కుటుంబాల్లో పాటిస్తుంటాం. మొత్తానికి 18ఏళ్ళు వచ్చేసరికి దారిలో పెట్టేయాలి. అయితే ఇదే ఇప్పుడు మాకు ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తూ,ఫ్రీడమ్ ఇచ్చామని,అందుకే ఇప్పుడు మా మాట వినడం లేదు”అని కృష్ణం రాజు ఆవేదనతో అంటున్నారు. తను ఎవరిని చేసుకుంటానంటే ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేస్తామని కూడా చెప్పాడు.

సాహు తర్వాత సొంత గోపికృష్ణ బ్యానర్ పై ప్రభాస్ ఓ చిత్రం చేయబోతున్నట్లు కూడా కృష్ణంరాజు ప్రకటించాడు. ఇక చాన్నాళ్లుగా అనుష్కతో లింక్ పెట్టి ఎన్నో వార్తలు గుప్పుమన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్, అనుష్కల పెళ్లి ఖాయమనే ఊహాగానాలు వచ్చాయి. దీనిపై అభిమానులకే కాదు, ఇండస్ట్రీలో లో క్లారిటీ లేకపోవడం ఆసక్తికరంగా మారింది.

పోనీ ప్రభాస్ ఏమైనా మీడియాతో మాట్లాడతాడా అంటే అదీ లేదు . ఇక అనుష్క ఎప్పుడైనా మీడియాతో మాట్లాడితే సినిమా కబుర్లు చెప్పి ముగించడం తప్ప పెళ్లి ఊసు రాదు. ఇక వీరిద్దరి యవ్వారం కాలానికి వదిలియడం తప్ప ఎవరు మాత్రం ఏం చేయగలరని అభిమానులు అంటున్నారు.