Movies

లేటు వయస్సులో టబు పెళ్లి .. పెళ్ళికొడుకు ఎవరో తెలుస్తే షాకవ్వాల్సిందే

టబు పేరు చెప్పగానే యువ హృదయాలు ఉప్పొంగుతాయ్. బాలీవుడ్ లో నటిస్తూ కూలీ నెంబర్ వన్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన టబు హైట్ గా ఉండడం వలన పెద్ద హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. హిందీలో అజయ్ దేవ్ గన్, హిందీలో నాగార్జున ఇలా తన పొడవుకు తగ్గ హీరోలతో జతకట్టింది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన టబు బాల నటిగా రంగప్రవేశం చేసింది. ఈమె కాలేజీ డేస్ లో వుండగానే ఆమె అక్క ఫెరా బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. దీంతో తానూ హీరోయిన్ గా రాణించాలని అక్క బాటను ఎంచుకున్న టబు బాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంది. మెగా ప్రొడ్యూసర్ రామనాయడు తీసిన కూలీ నెంబర్ వన్ చిత్రంతో వెంకటేష్ సరసన నటించి,టాలీవుడ్ లో ప్రవేశించిన టబు, ఆ తర్వాత నాగార్జున సరసన ‘నిన్నే పెళ్లాడుతా’చిత్రంలో నటించి యువహృదయాలను కొల్లగొట్టింది.

హిందీ,తమిళం,తెలుగు భాషల్లో బ్యూటీ హీరోయిన్ గా వెలిగిపోయింది. అప్పట్లో టబు నటించిన ‘ప్రేమదేశం’ సినిమా కుర్రకారుని ఎంతగా ఊపేసిందో అందరికీ తెల్సిందే. టబు పర్సనల్ విషయానికొస్తే,టెలీవుడు హీరో నాగార్జునతో ఎఫైర్ ఉందని అప్పట్లో వచ్చిన ప్రచారం ఇప్పటికీ కొనసాగుంతోంది. అందుకే టబు పెళ్లి జోలికి పోలేదని ఎన్నో కథనాలు వచ్చాయి. నాగ్,టబు కుటుంబ పరంగా మంచి ఫ్రెండ్స్ అని చెబుతారు.

ఇక టబు వయస్సు 46 ఏళ్లకు చేరింది. ఇంత వరకూ పెళ్లి ఊసు ఎట్టకపోవడంతో ఆమెకు ఇక పెళ్లి యోగం లేనట్టేనని సినీ జనాలు ఒక అంచనాకు వచ్చేసారు. అయితే కొంతకాలంగా ఓ ముంబాయి వ్యాపారవేత్తతో టబు రిలేషన్ షిప్ తో ఉందని తాజాగా కథనాలు వినిపిస్తున్నాయి. అతని పేరు ‘షా’అని బాలీవుడ్ వర్గాల్లో టాక్. ఉత్తరాదిన ఎన్నో పరిశ్రమలకు అధిపతి అయిన షా తోనే త్వరలో టబు పెళ్లి ఖాయమని అంటున్నారు.

కోట్ల అధిపతికి వారసుడైన షా కు బాలీవుడ్ తో పరిచయాలు కూడా వున్నాయట. అలాంటి వ్యక్తితో జతకట్టాలని భావిస్తున్నందున ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను త్వరగా పూర్తిచేయడానికి ఈ హైదరాబాద్ బ్యూటీ రేయింబవళ్లు తెగ కష్టపడుతోందట. ఇటీవల ఓ ఇంటర్వ్యులో కూడా ‘పెళ్లి లేకుండా ఒంటరిగా ఉండిపోవాలని లేదు.

వైవాహిక జీవితంలో ప్రవేశించి పిల్లల్ని కని, జీవితాన్ని ఎంజాయి చేయాలని అనుకుంటున్నా’అని ఈ సుందరి చెప్పింది. పెళ్ళికి రెడీ అయినట్లు సంకేతాలు ఇవ్వడంతో శుభ ముహూర్తం ఎప్పుడోనని సినీ జనాలు ఎదురుచూస్తున్నారు.