Movies

జీవిత ఎవరి కూతురో తెలుసా….రాజశేఖర్ తో జీవిత పెళ్లి ఎలా జరిగిందో తెలుసా?

టాలీవుడ్ లో హీరో హీరోయిన్లుగా రాణిస్తూ, ఆతర్వాత పెళ్లి బంధం తో ఒక్కటై జీవనం సాగిస్తున్న వాళ్ళు టాలీవుడ్ లో చాలామందే వున్నారు. ఇందులో జీవిత, రాజశేఖర్ జంట ఒకటి. కొందరు అందంతో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటే మరికొందరు అభినయంతో స్టార్ గా ఎదుగుతారు. రెండవ కోవకు చెందిన జీవిత పలు సినిమాల్లో హీరోయిన్ గా రాణించింది. దర్శకురాలిగా కూడా పలు చిత్రాలు రూపొందించింది. జీవిత తలంబ్రాలు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ అనేక హిట్ చిత్రాల్లో నటించి., తన స్టామినా ఏమిటో నిరూపించింది. హీరో డాక్టర్ రాజశేఖర్ తో కల్సి పలు చిత్రాలలో నటించిన జీవిత చివరకు ఆయన్నే వివాహం చేసుకుంది. వీరిద్దరికీ శివాని, శివాత్మిక అనే ఇద్దరు కూతుళ్లు వున్నారు. ఇందులో శివాని టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతోంది.

నటిగానే కాకుండా దర్శకురాలిగా డాక్టర్ రాజశేఖర్ ని హీరోగా పెట్టి శేషు , మహంకాళి,సత్యమేవ జయతే చిత్రాలు రూపొందించింది. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టిన జీవిత వివిధ కారణాలవలన అక్కడ మాత్రం సక్సెస్ కాలేదు. ఇక జీవిత వ్యక్తిగత విషయానికి వస్తే, ఆమె ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. సొంతూరు శ్రీశైలం. ఈమె అసలు పేరు పద్మ.

ఈమె తండ్రి రామనాధం వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ ఇన్ స్పెక్టర్ గా సేవలందించారు. తల్లి శకుంతల కూడా అదే శాఖలో నర్స్ గా పనిచేసింది. జీవితకు ఓ అక్క, ఓ అన్న ఉన్నారు. చైల్డ్ దశనుంచే డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయిగా గుర్తింపు పొందిన జీవిత సినీ రంగంలో ఫైర్ బ్రాండ్ అయింది. డైరెక్టర్ తేజ, కొరియాగ్రాఫర్ సుచిత్రా చంద్ర బోస్ లు స్కూల్ డేస్ లో జీవితకు క్లాస్ మేట్స్.

ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ ఈమెకు సీనియర్. ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా వెనుకంజ వేయని మనస్తత్వం జీవిత సొంతం. ఇక జీవిత లేని జీవితాన్ని తాను ఊహించలేనని డాక్టర్ రాజశేఖర్ కూడా ఎన్నో సార్లు చెప్పాడు. అసలు జీవిత సినీ రంగ ప్రవేశం కూడా ఆసక్తి కరమే. మహానటుడు ఎన్టీఆర్ దగ్గర జీవిత గ్రాండ్ ఫాదర్ ఎక్కౌంటెంట్ గా పనిచేసేవారు.

ఆ విధంగా చిత్ర పరిశ్రమతో జీవితకు సంబంధం ఏర్పడి, సినీమాల్లో నటించాలనే కోరికను పెంచాయి. పరిశ్రమలో పలువురితో ఏర్పడ్డ పరిచయాల కారణంగా ఆమె మొదట తమిళ చిత్రం తో అరంగేట్రం చేసింది. దాదాపు 20 పైగా తమిళ చిత్రాల్లో నటించిన జీవిత ఆతర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. హీరోయిన్ గానే కాకుండా అనేక క్యారెక్టర్ పాత్రలు వేసి, మెప్పించింది. జీవిత ప్రస్తుతం కూతుళ్ళ కెరీర్ ని ప్లాన్ చేస్తూ బిజీ గా వుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."