Movies

అకిరా గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు….తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. 14ఏళ్ళ ఈ టీనేజర్ 2004లో పుట్టాడు. పవన్ , రేణు దేశాయ్ ల ప్రేమకు గుర్తుగా జన్మించిన అకీరా నిత్యం ఏదో ఒక వార్తలో ఉంటున్నాడు. ఇందుకు కారణం తరచూ ఇప్పుడు పవన్ వెంట దర్శనం ఇవ్వడమే. పైగా తండ్రి పవన్ ని మించి పోయి 6ప్లస్ హైట్ తో సినీ హీరోని తలపిస్తున్నాడు. పబ్లిక్ లో కూడా ఏక్టివ్ గా కనిపిస్తున్నాడు. అందుకే ఈ మెగా వారసుణ్ణి చూసి పవన్ అభిమానులు,జనసేన సైనికులు తెగ మురిసిపోతున్నారు.నిజానికి తమ కలలపంటగా జన్మించిన అకీరాకు 5ఏళ్ళ వయస్సు వచ్చాక గానీ పవన్, రేణులు పెళ్లి చేసుకోలేదు.

అయితే 2012లో పవన్, రేణు విడిపోవడం దురదృష్టకరం అని చెప్పాలి. పవన్ నుంచి రేణు వేరుపడిన వెంటనే అకిరా, ఆద్యలను తీసుకుని పూణే వెళ్లి , మరాఠీ సినీ ఇండస్ట్రీలో దర్శకురాలిగా స్థిరపడింది. పిల్లలను ఎంతో క్రమశిక్షణతో, బాధ్యతగా పెంచుతోంది. ప్రస్తుతం పూణే ఇంటర్ నేషనల్ స్కూల్ లో అకిరా 9వ తరగతి చదువుతున్నాడు.

చదువులు ఏవరేజ్ గానే వున్నా, మరోపక్క కరాటే, కుంగ్ ఫు వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది పూణేలో టాప్ గా పేరు తెచ్చుకున్నాడు. తండ్రి పవన్ బాటలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అకిరా శిక్షణ ఇచ్చే రేంజ్ కి ఎదిగాడంటే ఇక వేరే చెప్పక్కర్లేదు. అంతేకాదు తాను చదివే స్కూల్ లోనే తనకన్నా పెద్దవాళ్లకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్నాడు.

ఇక తల్లి రేణు దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ వాలా లో నటించాక అకిరా పేరు మారుమోగిపోవడంతో బయటకు వెళ్తే ఇబ్బందులు వస్తాయని ఇద్దరు బౌన్సర్లను ఏర్పాటుచేసింది రేణు. అయితే వాళ్ళను పక్కన పెట్టేసి ఒంటరిగా పబ్లిక్ లోకి వెళ్ళేవాడు. పూణేలో అకీరాకు ఫ్రెండ్స్ తక్కువే. రేణు మేనల్లుడు తో అకిరా క్లోజ్ గా ఉంటాడు. ఓరోజు అతడి స్కూల్ పుస్తకంపై హీరోయిన్ శిల్ప శెట్టి ఫోటో ఉండడంతో తట్టుకోలేకపోయిన అకిరా వెంటనే తల్లికి కంప్లైంట్ చేసాడు.

రేణు తన మేనల్లునితో కల్సి స్కూల్ కి వెళ్లి, ప్రిన్సిపాల్ తో చెప్పి పెద్ద క్లాస్ పీకిందట. నైతిక విలువల పట్ల నిబద్దత గల అకిరా చదువుకునే పుస్తకాలపై ఇలా హీరోయిన్స్ బొమ్మలు ఉండడం భరించలేకపోయాడు. ఇప్పటినుంచే సమాజం, విలువలు అంటూ తండ్రి పవన్ బాటలో పయనిస్తున్న అకిరా భవిష్యత్ లో సామాజిక ఉద్యమకారుడు అవుతాడని రేణు అభిప్రాయ పడింది.

ఇక అకిరా హైదరాబాద్ వస్తే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంట్లోనే గడుపుతాడు. ఇది చాలామందికి నమ్మకపోవచ్చు కానీ,త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు రిషి మనోజ్,అకిరా ప్రాణ స్నేహితులు. వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా, తరచూ ఫోన్ లో ముచ్చట్లాడుకుంటారు. అంతేకాదు పవన్ కొడుకుని త్రివిక్రమ్ కూడా ఎంతో అపురూపంగా చూస్తాడట అకిరా హైదరాబాద్ వస్తే మాత్రం ఇద్దరి అల్లరికి అంతు ఉండదట.