Movies

మిల్కీ బ్యూటీ తమన్నా ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

టాలీవుడ్ లో పలు హిట్స్ కొట్టి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మంచి స్థానం కొట్టేసిన ముట్టుకుంటే కందిపోయే మిల్క్ బ్యూటీ తమన్నా తమిళంలో సైతం మంచి గుర్తింపు సాధించింది. సౌత్ ఇండియాలో మిల్క్ బ్యూటీ అంటే తమన్నా మాత్రమే అన్నంతగా యువ హృదయాలను కొల్లగొట్టింది. తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, , జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్,రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలందరి సరసన తమన్నా నటించి తానేమిటో చాటి చెప్పింది. డాన్స్ స్టార్ గానే కాకుండా నటనలో కూడా రాణిస్తోంది. 100% లవ్ చిత్రంలో సూపర్బ్ గా నటించి ఏకంగా నాలుగు అవార్డులు సొంతం చేసుకుంది. ఇక బాహుబలి తర్వాత మరింత దూసుకు పోతుందని అందరూ భావించారు.

ఎందుకో మరి రివర్స్ లో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. అభినేత్రి, బెంగాల్ టైగర్ వంటి మూవీస్ తప్ప, ఈమెకు తగ్గ అవకాశాలు రావడం లేదు. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న రీతిలో మంచి పొజిషన్ లో ఉండగానే వైటల్ గ్రౌండ్ పేరిట బంగారు నగల వ్యాపారంలో అడుగుపెట్టింది.

బిజినెస్ పై పూర్తిగా దృష్టి పెట్టిన తమన్నా త్వరలోనే ఓ ఇంటికి ఇల్లాలు కాబోతోందని అంటున్నారు. ఎందుకంటే ఈ మిల్క్ బ్యూటీ వయస్సు 30 కి చేరడంతో ఇంట్లో వత్తిడి పెరిగి పెళ్లి కోసం సమాయత్తం అవుతోందట. విశేషమేమంటే తమన్నా సోదరుడు ఆనంద్ భాటియా పెళ్లి కూడా అయిపోవడం, యుఎస్ లో డాక్టర్ గా సెటిల్ అయ్యాడు.

ఆమెకు కూడా పెళ్లి చేసేయాలని పేరెంట్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఆనంద్ పనిచేసే హాస్పిటల్ లోనే ఓ ఇండియన్ యువ డాక్టర్ ని చూసి మిల్క్ బ్యూటీ మనసు పారేసుకుందట. అతన్నే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది. గుజరాత్ నుంచి ఎప్పుడో అమెరికాలో స్థిరపడిన ఆ యువకుని కుటుంబం మంచి స్థితిలోనే ఉంది. వాళ్లకు యుఎస్ లో చాలా వ్యాపారాలున్నాయి.

ఇప్పటికే రెండు కుటుంబాల నడుమ మాటలు కూడా నడిచాయని, పెళ్లి నిశ్చితార్ధం పూర్తిచేసి, పెళ్లి పనుల్లో బిజీ కావాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయట. పెళ్లి తర్వాత ఆమె అమెరికాలోనే స్థిరపడుతుందట. అయితే తమన్నా పెళ్లి వార్త హల్ చల్ అవ్వడం చూసి నెటిజన్లు తెగ బాధ పడిపోతున్నారట.