Movies

బాబు గోగినేని సామాన్యుడు కాదండోయ్….చూస్తే మీకే అర్ధం అవుతుంది

బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్న బాబు గోగినేని నిజానికి హేతువాది. పలు టివి చానల్స్ లో కూడా పలు అంశాలపై చర్చాగోష్టిలో పాల్గొని తన వాదన వినిపించిన బాబు గోగినేని ఇప్ప్పుడు బిగ్ బాస్ హౌస్ లో టాక్ అయ్యారు. 1965 ఏప్రియల్ లో హైదరాబాద్ లో జన్మించిన ఈయన మానవతావాదిగా పేరొందారు. రాజాజీ రామానంద బాబు గోగినేని ఈయన పూర్తి పేరు. అరుణకుమారి, గురుబాబు ఈయన పేరెంట్స్ . వీరి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో సెటిలయ్యారు. ఈయన బాల్యం, విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే కొనసాగింది. ఎప్పుడూ చదువులో ముందుండే బాబు గోగినేని 18వ ఏటా ఫ్రెంచ్ భాషలో ప్రావీణ్యం సంపాదించి, భాగ్యనగరంలో మొట్టమొదటి ఫ్రెంచ్ టీచర్ గా గుర్తింపు పొందాడు.

నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన బాబు గోగినేని ఉస్మానియా లో పిజి పూర్తిచేశారు. అనంతరం 10ఏళ్లపాటు ఇంటర్ నేషనల్ హ్యూమ నిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ కి అధ్యక్షునిగా వ్యవహరించారు. 40దేశాల్లో సభ్యతం కలిగిన ఈ సంఘంలో పలు ఉద్యమాలు నడిపి అంతర్జాతీయంగా పేరొంది, ఫలితంగా ఈయన కార్యకలాపాలపై ఇంటర్ నేషనల్ లెవెల్లోని ప్రముఖ ప్రత్రికలైన సి ఎన్ ఎన్, న్యూ యార్క్ టైమ్స్,బిబిసిలలో విస్తృత కథనాలు వచ్చాయి.

విదేశీ భాషలు,లౌకికవాదం,మానవ హక్కులు, విజ్ఞానం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగాలు చేసారు. పలు పత్రికల్లో వ్యాసాలు రాసారు. మెక్సికో విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక స్పీచ్ ఇచ్చిన ఈయన కేంబ్రిడ్జి లో జరిగిన చర్చా గోష్టిలో గెలుపొందిన టీమ్ లో ఈయన ఒకరు.
ఇక పాకిస్థాన్ ప్రభుత్వం యునాన్ షేక్ అనే వ్యక్తికి అప్పట్లో మరణ శిక్ష విధిస్తే,ఆయన తరపున బాబు గోగినేని అంతర్జాతీయ పోరాటం చేసి, షేక్ విడుదలకు కారణమయ్యాడు.

ఇంటర్ నేషనల్ హ్యూమ నిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న బాబు,జనరల్ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. సౌత్ ఏషియా హ్యుమానిస్ట్ కి జనరల్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. ఇండియన్ రాడికల్ హ్యుమానిస్ట్ సెక్రటరీ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంటర్ నేషనల్ హ్యూమ నిస్ట్ మీడియాకు ఎడిటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

మానవ హక్కులు, హేతువాదం గురించి డిగ్రీ స్థాయినుంచి పోరాటం చేస్తున్న బాబు,పలు సంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తూ,అంతర్జాతీయ స్థాయిలో తానేమిటో నిరూపించుకుంటున్నారు. ఇక మానవతా వాదంపై బాబు సాగించిన చర్చల నేపథ్యంలో బిగ్ బాస్ లో అదే అంశంపై అవకాశం దక్కించుకుని, హౌస్ మెంబర్స్ తో పాటు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."