Movies

కమల్ హాసన్ తో విడిపోయాక గౌతమి పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సినీ రంగంలో నటీనటుల జీవితాలు చూస్తే ఒక్కక్కరిదీ ఒక్కో మలుపు. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుందో ఎప్పుడు, కల్సి వుంటారో, ఎప్పుడు విడిపోతారో చెప్పలేం అన్నట్లుగా కొన్ని సంఘటనలుంటాయి. అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగి, విశ్వ నటుడు కమల్ హాసన్ తో సహజీవనం చేసిన నటి గౌతమి ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారిపై పోరాటం చేస్తూ ఓ యోధురాలిగా బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఒకప్పుడు క్యాన్సర్ కారణంగా మరణం అంచుల వరకూ వెళ్లొచ్చిన గౌతమి వేలాదిమంది క్యాన్సర్ పీడితులకు సేవా కార్యక్రమాలు సాగిస్తోంది. నిజానికి ఈమె అచ్చమైన తెలుగమ్మాయి. ఈమె పూరిపేరు తాడిమళ్ల గౌతమి. 1968జూలై 2న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం విశాఖ లోనే సాగింది.

గీతం ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేస్తుండగానే, దయామయుడు అనే తెలుగు చిత్రంలో వచ్చిన అవకాశంతో చదువుకి గుడ్ బై కొట్టేసి, సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. గాంధీ నగర్ రెండవ వీధి, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాలతో ప్రేక్షలకు దగ్గరైన గౌతమి ఆతర్వాత తమిళంలో అడుగుపెట్టి,స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

తమిళంలో దాదాపు అందరి హీరోల సరసన నటించింది. అయితే కుటుంబంలో ఎదిరించి, సందీప్ భాటియాను 1998జూన్ 4న చెన్నైలోని ఓ హోటల్ లో కొద్దిమంది సన్నిహితుల నడుమ ప్రేమవివాహం చేసుకుంది. ఓ ఏడాదికే వీరి పెళ్లి పెటాకులైంది. అప్పటికే పుట్టిన బిడ్డకు సుబ్భలక్ష్మి అనే పేరు పెట్టారు. ఒంటరిగా మిగిలిన గౌతమి మళ్ళీ సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

అయితే సినిమాల్లో హీరోయిన్ వేషాలు రాకపోవడంతో ఐటెం సాంగ్స్ కూడా చేయాల్సి వచ్చింది. అప్పటికే కమల్ తో ఎక్కువ సినిమాలు చేసి ఉండడం, ఇద్దరి మధ్యా స్నేహం ఉండడం,చంటిపిల్లతో గౌతమి. ఇద్దరు పిల్లలతో కమల్ ఇలా ఇద్దరూ ఒకటవ్వాలని అనుకున్నారు. అయితే గౌతమి క్యాన్సర్ బారిన పడడంతో 45సార్లు రేడియేషన్ నిర్వహించాల్సి రావడంతో జీవచ్ఛవంలా మారింది.

ఆమె గౌతమేనా అనిపించేలా మారిపోయినప్పటికీ ఒంటరి పోరాటం సాగించింది. తన కూతురు కోసం బతకాలనే తపన ఆమెను క్యాన్సర్ మహమ్మారి పోరాటంలో విజేతగా నిలిపింది. కొన్నాళ్ల తర్వాత కమల్ తో కల్సి సహజీవనం చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఇలా 13ఏళ్ళు కల్సివున్నాక ఉన్నట్టుండి విడిపోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు.

అయితే కమల్ కూతురు శృతిహాసన్ వల్లనే వీరిద్దరూ విడిపోయారని వాదన వినిపించింది. కాగా శృతిని తానె పెంచానని, వ్యక్తిగత కారణాలతో బయటకు వచ్చేసానని గౌతమి చెప్పింది. తన కూతురు సుబ్బలక్ష్మి కెరీర్ పైనే దృష్టి పెడుతున్నట్లు కూడా చెప్పింది. లైఫ్ అగైన్ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి,దేశంలో అనేకచోట్ల క్యాన్సర్ బాధితులకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తోంది.

క్యాన్సర్ బారినపడి కోలుకున్న మనిషా కొయిరాలా,మమతా మోహన్ దాస్ వంటి సినీ తారలు కూడా ఈమెతో చేయికలిపారు. ఇక రాజకీయాలంటే ఇష్టపడే గౌతమి వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోతోందని అంటున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యారు. బీజేపీలో చేరుతారనే ఊహగాహనాలు వినిపిస్తున్నాయి. క్యాన్సర్ బాధితులలో చైతన్యం కల్పించడంతో పాటు వారికి అవసరమైన వాటిని తీర్చడానికి నిధులు సేకరించి, పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది.