Movies

మంచు లక్ష్మి తో ఎవరికీ తెలియని సీక్రెట్స్ పంచుకున్న రేణు దేశాయ్…. అవి ఏమిటో తెలుసా?

ఎంత సీక్రెట్ గా ఉంచుదామన్నా సరే ఒక్కోసారి అవి బయటకు వచ్చేస్తాయి. అవి మంచి విషయాలైతే మరీ ఆనందంగా వస్తాయి. సరిగ్గా రేణు దేశాయ్ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సహజీవనం, పెళ్లి ,ఆ తర్వాత విడాకులు ఇవన్నీ ఇక గతానికి సంబంధించిన విషయాలే. ఎందుకంటే, విడాకులు తీసుకున్నాక పవన్ మళ్ళీ పెళ్లి చేసుకోగా, ఇప్పుడు రేణు రెండో పెళ్ళికి రెడీ అయింది. కాబోయో వరునితో జరిగిన నిశ్చితార్ధం లో కుమారుడు అకిరా, కుమార్తె అధ్య కూడా హుషారుగా పాల్గొన్నారు. ఇక పవన్ కూడా రెండో పెళ్లి చేసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెల్పాడు.

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, మంచు లక్ష్మి యాంకర్ గా వ్యవహరిస్తూ నిర్వహిస్తున్న మేము సైతం టెలివిజన్ షో జూన్ 1న టెలివిజన్ లో ప్రసారం అయింది. ఈ కార్యక్రమంలో రేణు దేశాయ్ పాల్గొంది. ఈసందర్బంగా మంచు లక్ష్మి అడిగిన పలు ప్రశ్నలకు స్పందిస్తూ రేణు ఎంతో ఓపిగ్గా జవాబులిచ్చింది.

అసలు పవన్ కల్సింది బద్రి సినిమా కోసమేనని, ఆసమయంలో మాట్లాడుకున్నప్పుడు ఇద్దరి అభిరుచులు ఒకటేనని తేలిందని, నిజానికి మా ప్రేమకు అదే పునాది అని పేర్కొంది. సమాజాన్ని చూసే విషయంలో ఇద్దరు ఒక్కటేనని, అప్పటినుంచే ఫ్రెండ్స్ అయ్యామని వివరించింది.
అసలు విషయం చెప్పాలంటే, బద్రి షూటింగ్ సమయంలోనే పవన్ తో కల్సి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని, అయితే ఇలాంటి పబ్లిసిటీ చేసుకోవడం పవన్ కి నచ్చదని, అందుకే ఇవేమీ పబ్లిక్ తెలీదని రేణు దేశాయ్ పూసగుచ్చినట్లు వివరించింది.

ఇక ఫస్ట్ టైం ఆడిషన్స్ సందర్బంగా పవన్ నన్ను సుబ్బమ్మ అని పిలిచేవాడని తెల్పింది. ఎందుకంటే తాను పల్లెటూరి అమ్మాయిల బిహేవ్ చేయడం వలన ఇలా అనేవాడని చెప్పింది. కాగా మేము సైతం కార్యక్రమం ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్న మంచు లక్ష్మిని రేణు మనస్ఫూర్తిగా అభినందించింది. నీ కారణంగా ఎంతోమంది చిన్నారులకు విద్యావకాశాలు అందుతున్నాయని వేనోళ్ళ కొనియాడింది రేణు.