Movies

అమిత్ బిగ్ బాస్ హౌస్ లో విలన్ గా ఉంటున్నాడా….హీరోగా ఉంటున్నాడా తెలిస్తే ఆశ్చర్యపోతారు

బుల్లి తెరపై గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా సూపర్ హిట్ అయింది. ఇక అదే ఊపుతో కొనసాగుతున్న సీజన్ 2 రోజు రోజుకీ అంచనాలు పెంచేస్తోంది. మొదటి సీజన్ మాదిరిగానే రెండవ సీజన్ కూడా అదే రేంజ్ లో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ లో సాగుతోంది. ఎన్టీఆర్ ప్లేస్ లో నాని అదరగొట్టే ఈ ప్రోగ్రాం 100 రోజులు కొనసాగుతుంది. గత సీజన్ కన్నా మరింత మసాలా దట్టించి, తెలుగు రాష్ట్రాల్లో వీక్షకులకు వినోదాల విందు పంచడానికి రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఈ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా టాలీవుడ్ విలన్ అమిత్ తివారీకి ప్లేస్ మెంట్ ఇచ్చారు. సినిమాల్లో భీకరంగా విలనిజం ప్రదర్శించే అమిత్ ఈ షోలో ఎంట్రీ ఇవ్వడంతో అందరూ హడలిపోయారు.

నిజానికి విలన్ పాత్రలు వేసే అమిత్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరూ దగ్గరకొచ్చి పలకరించడానికి వచ్చేవారు కాదట. ఈవిషయాన్ని నానితో స్వయంగా అమిత్ చెప్పాడు. అందుకే నిజానికి ఎలా బిహేవ్ చేస్తానో రుజువుచేయడానికే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయ్యాడు. విక్రమార్కుడు, ఖలేజా, అత్తారింటికి దారేది , టెంపర్,లక్ష్యం , సన్నాఫ్ సత్యమూర్తి మొదలగు సినిమాల్లో విలన్ గా జీవించాడు.

మంచి విలనిజం ప్రదర్శించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న తివారి ఉత్తరాఖండ్ కి చెందినప్పటికీ అతని పేరెంట్స్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లోనే సెటిలయ్యారు. ఫలితంగా అమిత్ భాబ్యనగరంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేసి విలన్ గా ఎంట్రీ ఇచ్చి విలనిజంలో దిట్టగా ఎదిగాడు. అమిత్ చిన్నప్పుడు చాలా అల్లరిచేసేవాడట.

అతనికి ఓ తమ్ముడు చెల్లి వున్నారు. అమిత్ గంటకో తగవు పెట్టుకుని వచ్చేవాడట. కాలనీ వాళ్ళు రోజూ పిర్యాదు చేసినా సరే, ఆవన్నీ తట్టుకుని వాళ్ళమ్మతో ఓపికకా గారాబంగా పెంచింది. అతని తండ్రి వ్యాపారం కోసం వేరే ప్రాంతాలకు టూర్లకు వెళ్ళేవాడు. అయితే అల్లరి చిల్లరగా తిరిగి సినిమాలపై మోజు పెంచుకొని , చేసిన ప్రయత్నాలకు తోడు అమిత్ ఫాదర్ సినిమా వాళ్లతో పరిచయం ఉండడం చాలామంది సినీ ప్రముఖులను కలవడం వలన అవకాశాలు వచ్చాయి.

మొదట్లో చిన్న చిన్న రోల్స్ పోషించినా ఆతర్వాత విక్రమార్కుడులో మాంచి మసాలా దట్టించిన విలన్ పాత్ర దొరకడంతో అమిత్ కి మంచి బ్రేక్ వచ్చింది. దీంతో ఇక వెనక్కి తిరిగి చూడలేదు. టాలీవుడ్ లో విలన్ గా నిలదొక్కుకున్న ఇతడు, హిందీ , తమిళ,మలయాళ మూవీస్ లో కూడా రాణించాడు. ప్రస్తుతం బిగ్ బాస్ లో అవకాశాలు రావడంతో బిగ్ హౌస్ లోకి ప్రవేశించిన అమిత్ బయట భీకరంగా వున్నా, హౌస్ లో కలివిడిగా ఉంటూ అందరి మదిని దోచేస్తున్నాడు. దీంతో ఇతనేనా అమిత్ అని అందరూ అనుకుంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."