Movies

జబర్దస్త్ లో నాగబాబు గొంతు పోవటానికి అసలు కారణం ఏమిటో తెలుసా?

బుల్లితెర మీద అనేక షోలున్నా, జబర్దస్త్ షో కి ఉన్న కిక్కే వేరు. మొదటి నుంచీ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ షో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. యాంకర్స్,పార్టిసిపెంట్స్ ,చివరకు జడ్జి నాగబాబు వరకూ అందరూ ఎంటర్ టైనర్ గా ఈ షోని విజయవంతంగా సాగిస్తున్నారు. ఈ షో కొంచెం అటు ఇటు అయినపుడు పెద్ద పిల్లర్ గా నిలుస్తున్న మెగా బ్రదర్ నాగబాబు మొన్న వారం జరిగిన షోలో సైలెంట్ గా వున్నారు. ఆయన చెప్పాలనుకున్నది ఓ కాగితం మీద రాసివ్వడమో సౌజ్ఞ ద్వారా మాత్రమే చేసారు. దీంతో, షో అంటే కోపం వచ్చిందని, కాంటెస్టెంట్స్ అంటే కోపం వచ్చిందని ఇలా రక రకాలుగా అనేక మంది కామెంట్స్ చేసారు. అయితే ,దీనికి కారణం ఇవేవీ కావని తేలింది.

అసలు నిజం ఏంటంటే, నాగబాబు కి గత కొన్ని రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్ చాలా బాధ పెడుతోందట. అది చివరకు నోరు కూడా తెరవలేని పరిస్థితి కి తెచ్చిందట. అందుకే ఆయన సరిగ్గా మాట్లాడలేక పోయారట. ఇక నాగబాబు పరిస్థితిని గమనించిన షో యాజమాన్యం , సిబ్బంది కూడా కొన్ని రోజులు మీరు దయచేసి రెస్ట్ తీసుకోండి. షోని మీరు లేకుండానే మేం రన్ చేస్తాం.

రికవరీ అయ్యాక రావచ్చు ‘అని చెప్పారట. అయితే నాగబాబు స్పందిస్తూ “షో కి నేను రాకపోయినా వచ్చినా నడుస్తుంది. కానీ రాకపోవడం వలన కొంత డిస్టబెన్స్ వస్తుంది. సక్సెస్ గా నడుస్తున్న షోలో ఇలాంటి అవాంతరాలు మంచిది కాదు. నేను వస్తాను. ఎందుకంటే నేను పెద్దగా మాట్లాడేది ఉండదు కదా”అని చెప్పారట.

ఈ షో ఒక్కటే కాకుండా పార్టీ పనులు,వ్యక్తిగత పనులు,బయట పనులు ఇలా చాలా పనులు ఆయన నెత్తిన వేసుకున్నారు. దీంతో ఆ పనులు, ఈ పనుల్లో బిజీ గా ఉండడం వలన తీవ్రంగా టైర్ అయిపోయారు. ఫలితంగా గొంతు నొప్పికి దారితీసిందట. అయితే త్వరలోనే నాగబాబు గారికి గొంతు ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయి,జబర్దస్త్ షోలో మళ్ళీ యాక్టివ్ గా ఉండాలని ఆకాంక్షిద్దాం. ఎందుకంటే ఆయన షోకి వస్తున్నా, మాటల్లేవ్. మళ్ళీ పూర్వపు మాదిరిగా తయ్యారవతారని కోరుకుందాం.