Movies

లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేసే కౌశల్ చేసే బిజినెస్ ఏమిటో తెలిస్తే దిమ్మతిరుగుతుంది

సాధారణంగా ఏదైనా టివి షో మొదలైందంటే అందులో పనిచేసే,కంటెస్టెంట్స్ అందరూ సెలబ్రిటీలు అయిపోతుంటారు. ఇక మెగా షో గా రన్ అవుతున్న బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్ లో 16మంది ఉన్నప్పటికీ అందులో కొద్దిమంది మాత్రమే మనందరికీ తెల్సు. యాంకర్ శ్యామల, గీతా మాధురి,కుషాల్, టివి న్యూస్ ఛానల్ యాంకర్ దీప్తి నల్లమోతు,కొంతమంది యూట్యూబ్ చేసేవాళ్లకు దీప్తి సునైనాలు మాత్రమే తెల్సు. ఇక హీరోగా తనీష్ అక్కడక్కడా కనిపించినా ఇప్పుడు పెద్దగా చేయటం లేదు. అయితే ఈ షోలో పాల్గొనకముందే వాళ్ళకొక ఇమేజ్ ఉన్నవాళ్లున్నారు. పార్టీసిపెంట్ చేసాక మరో ఇమేజ్ వస్తుంది. అందులో ప్రధానంగా కౌశల్ ఒకడు. ఇతడు హ్యాండ్సమ్ మోడల్., యాక్టర్ కూడా. ఎన్నోరకాల అవార్డులు రివార్డులను సొంతం చేసుకున్నాడు.

అయితే, ఓ యాంకర్ గా, సీరియల్స్ లో నటుడిగానే తెల్సిన కౌశల్ నిజానికి ఒక పెద్ద బిజినెస్ మాన్. ద లుక్స్ ప్రొడక్షన్ కంపెనీ నిర్వహిస్తున్న
కౌశల్ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నాడు. ఇతడు పుట్టింది, చదివిందీ అంతా విశాఖ పట్నంలోనే. బిటెక్ చదివిన కౌశల్ మెకానికల్ లో మెటలాజి డిపార్ట్ మెంట్ లో స్పెషలైజేషన్ కూడా చేసాడు.

తాను చదివిన చదువుకి అనుగుణంగా ఉద్యోగం చేయాలని భావిస్తున్న తరుణంలో ‘అందంగా వుంటారు కదా మోడల్ గా ఎందుకు ట్రై చేయకూడదు’అని కొందరు ఎంకరేజ్ చేసారు. ఫలితంగా ముంబయిలో మోడలింగ్ కోర్సు పూర్తిచేసిన అతనికి వెంటనే అవకాశాలు వెల్లువెత్తాయి.
వరుస యాడ్స్ లో బుక్ అయిన కౌశల్ ఢిల్లీలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీల్లో అవార్డు సొంతం చేసుకున్నాడు. చాలా పైకి ఎక్కి, సోప్ ఎక్కి ఇలా ఎన్నో రకాల విభిన్న యాడ్స్ చేసాడు.

చక్రవాకం,సూర్య వంశం లాంటి సీరియల్స్ లో గొప్ప నటుడని అనిపించుకున్న కౌశల్ కొన్ని సినిమాలో సపోర్టింగ్ రోల్స్ తో అందరికీ సుపరిచితుడయ్యాడు. నిజానికి వాళ్ళ ఫాథర్ కూడా యాక్టర్ అట. ఆయన ఓల్డ్ సినీ ఆర్టిస్ట్. అయితే కౌశల్ ఆయన కొడుకేనని బిగ్ బాస్ షోకి వెళ్ళేదాకా ఎవరికి తెలీదు. ప్యూర్ వెజిటేరియన్ అయిన కౌశల్, నీలిమ అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఓ పాప , ఓ బాబు వీళ్ళకి. కౌశల్ పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీ.

హైదరాబాద్ లో వుండే కౌశల్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. 14 లక్షల విలువచేసే బైక్ వుంది. నాలుగు నెలల క్రితం రూ 47లక్షల విలువ చేసే, బిఎం డబ్ల్యూ కారు కొన్నట్లు చెబుతున్నారు. ఇక కౌశల్ నిర్వహించే ద లుక్స్ ప్రొడక్షన్ కంపెనీ లో యాడ్స్, ఫొటోగ్రఫీ, మోడలింగ్, యాడ్ ఎజన్సీ ఇలా రకరకాల విభాగాలుంటాయి.

ఎన్నో బైక్ కంపెనీలు, కార్ల కంపెనీ వాళ్ళు ఇక్కడకు వచ్చి వాళ్ళ వాళ్ళ యాడ్స్ చేసుకుంటారు. అందుకే ఇతని కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఫెయిర్ అండ్ లవ్ లీ, లక్ మీ ఇలా పలు యాడ్స్ కి మోడలింగ్స్ అందించిన ఘనత కౌశల్ కంపెనీకి ఉంది. ఈ కంపెనీకి ఫౌండర్, ఎండి అయిన కౌశల్ కి నెలకు 5నుంచి 10లక్షల జీతం వస్తుంది. ఇక ఈ కంపెనీ ఎన్నో అవార్డులు,రివార్డులు కూడా అందుకుంది.