Politics

జగన్,భారతిల పెళ్లి వెనక ఓ పెద్ద కథ…అదేమిటో తెలుసా?

పెళ్లి నూరేళ్ళ పంట అంటారు. ఎవరి పెళ్లి ఎవరితో జరుగుతుందో స్వర్గంలో నిర్ణయయించబడతాయని అంటారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్ భారతికి పెళ్లి ఎలా జరిగిదంటే దాని వెనుక ఓ కథ వుంది. ఇంటరెస్టింగ్ గా వుండే ఈ కారణం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే భారతి ప్రస్తుతం ఇంటి వ్యవహారాలు,బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ శక్తివంతమైన మహిళగా నిల్చింది . ఈమె ఓ గొప్పింటిలో పుట్టి, మరో పెద్ద ఇంటికి కోడలిగా వచ్చింది. ఆ ఇంటి బాధ్యతల్ని అవలీలగా మోస్తోంది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ చేసిన ఈమె ఓ అసాధారణ మహిళ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1996లో ఈమె జగన్ ని పెళ్లి చేసుకుంది.

భారతి పేరెంట్స్ సంఘంలో మంచి పేరున్న వైద్యులు. ఈమె తండ్రి గంగిరెడ్డి, తల్లి సుగుణా రెడ్డి ఇద్దరు సంఘంలో గౌరవ ప్రదంగా జీవనం సాగిస్తున్నారు. వీరు తమ కూతురు భారతిని పాలిటిక్స్ యాక్టివ్ గా ఉండే కుటుంబంలో ఓ కుర్రాడికి భార్యగా ఎందుకు పంపారంటే,దానికి ప్రధాన కారణం దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి.

అవును. డాక్టర్ వైఎస్, అలాగే డాకర్ సుగుణారెడ్డి ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరూ గుల్బర్గా మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడే నీ కూతురిని తన కోడలిగా చేసుకుంటా చెల్లెమ్మా అని మాట ఇచ్చారట డాక్టర్ వైఎస్. ఆలా ఇచ్చిన మాట ప్రకారమే తన కొడుక్కి భారతిని ఇచ్చి వివాహం జరిపించారట డాక్టర్ వైఎస్. ఆర్. ఆవిధంగా వైఎస్ ఫ్యామిలీ లోకి ఎంట్రీ ఇచ్చిన భారతి ఆనతి కాలంలోనే ఆ కుటుంబంతో కల్సిపోయింది.

మంచి కోడలిగా పేరుతెచ్చుకున్న భారతి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి, కుటుంబ అవసరాల నిమిత్తం ఇంటికి పరిమితమయ్యారు.అయితే అనుకోకుండా ఆమె వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇక అన్నీ చూసుకునే మామగారు అకాల మరణం చెందడం, ఆతర్వాత భర్త జైలు పాలు కావడంతో ఇటు కుటుంబ బాధ్యతలు అటు వ్యాపార బాధ్యతలు మోస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

కుటుంబం,వ్యాపారం ఈ రెండింటితో పాటు ఓ సాధారణ మహిళగా మంచి మార్కులు సంపాదించుకుంది. భర్త జైలుకి వెళ్ళినప్పుడు,ఓదార్పు యాత్రలో ఉన్నప్పుడు,పాదయాత్ర చేసున్నప్పుడు ఇలా భర్త ఎక్కడ వున్నా, భర్త అవసరాలను తీరుస్తూ, ఆదేశాలను పాటిస్తూ మంచి గృహిణిగా పేరుతెచ్చుకుంది. మొత్తానికి ఆరోజు డాక్టర్ వైఎస్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని భారతి రుజువుచేసింది.