సినిమాలకు గుడ్ బై చెప్పేసిన జబర్దస్త్ భామ రేష్మి …. కారణం ఏమిటో తెలుసా?

జబర్దస్త్ చూసే వారికి రేష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె యాంకర్ గా ఎన్నో షో లు చేస్తూ బిజీగా ఉంది. ఒక వైపు అనసూయ బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్ళితే రేష్మి మాత్రం వెండితెరలోనే ఉండిపోయింది. ఈ మధ్య కాలంలో రేష్మి సినిమాల్లో కనపడటం లేదు. అంతేకాక ఏ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదట. ఆమె మొత్తం దృష్టంతా బుల్లితెర మీదే పెట్టిందట. జబర్దస్త్ కార్యక్రమంతో మంచి పేరు తెచ్చుకున్న రేష్మి అనేక కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది. సుదీర్,రేష్మి పెళ్లి వీడియో ఒకటి వైరల్ అయింది. అయితే అది ఒక ఛానల్ వాళ్ళు చేసిన కార్యక్రమం అని తర్వాత తెలిసింది. ఇలా రేష్మికి బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దాంతో ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి వెండితెరను కాదని బుల్లితెర మీద తన దృష్టంతా పెట్టేసింది.

గుంటూరు టాకీస్ సినిమాలో రేష్మి చేసిన అందాల ప్రదర్శన కుర్రకారులో మంచి క్రేజ్ ని తీసుకువచ్చింది. ఆ సినిమా హిట్ కావటంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ క్రేజ్ తో అనేక సినిమాల్లో నటించింది రేష్మి.

అయితే ఆ సినిమాలు అనుకున్నంతగా ఆడకపోవడంతో అవకాశాలు నిదానంగా తగ్గాయి. దాంతో బుల్లితెర బెటర్ అని భావించిన ఈ జబర్దస్త్ భామ బుల్లితెరపై దృష్టి పెట్టేసింది.బుల్లితెరపై సక్సెస్ గా ముందుకు సాగుతుంది.