Movies

చిరంజీవి, పవన్ యాడ్స్ చేయకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? అభిమానుల కోసమే…ఎలా?

ఒకప్పుడు తెలుగులో కొందరు హీరోయిన్స్ కే పరిమితమైన యాడ్స్ సంస్కృతి రానురాను అగ్ర హీరోలనుంచి అందరిలోనూ ప్రబలింది. ఎందుకంటే సినిమాల్లో వచ్చే డబ్బుకన్నా ఎక్కువగానే యాడ్స్ రూపంలో సొమ్ములు రావడం వల్లనే అందరూ ఇటువైపు కూడా మొగ్గుతున్నారు. గతంలో థమ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తే, అతని సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెప్సికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. అంతేకాదు నవరత్న ఆయిల్ కి కూడా చిరంజీవి అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత థమ్స్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. అయితే చిరు చేసినపుడు వివాదం మేలుకోగా, మహేష్ టైం లో అలాంటి వివాదం ఏదీ రాలేదు. ఓ బాధ్యతాయుతమైం స్థానంలో ఉంటూ, చిన్నపిల్లలకు ,పెద్దలకు చెడు చేసే ఇలాంటి హానికరమైన శీతల పానీయాల కు అనుకూలంగా ప్రకటనలు చేయడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తాయి.

ఫలితంగా చిరు ,పవన్ లు నాటినుంచి నేటివరకూ ఎలాంటి యాడ్స్ లో పాలుపంచుకోవడం లేదు. ఇక నందమూరి బాలయ్య ఏనాడూ ఇలాంటి వాటి జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సౌత్ ఇండియాలోనే ఎక్కువ గిరాకీ గల బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. థమ్స్ అప్ తో పాటు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరిస్తూ సినిమాల కన్నా అత్యధిక మొత్తాన్ని యాడ్స్ లో రాబట్టుకుంటున్నాడు.

ఆలాగే మెగా ఫ్యామిలీ నుంచి చూస్తే, అల్లు అర్జున్ రెడ్ బస్ ,ఫ్రూటీ, లాట్ మొబైల్స్ వంటి పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటే,మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఎప్పుడో అగ్రిమెంట్ కుదుర్చుకున్న పెప్సీ తో పాటు,హ్యాపీ మొబైల్స్ తో ఒప్పందం పెట్టుకున్నాడు. రవితేజ వాక్ మెట్ ప్రకటనల్లో వున్నాడు.

కాగా అక్కినేని ఫామిలీ నుంచి నాగార్జున కళ్యాణి జ్యుయలర్స్ ఘడి వంటి వాటికి చేస్తుంటే, మొదటి సినిమా విడుదల కాకముందే పలు సంస్థల్లో నాగ్ తనయుడు అఖిల్ బ్రాండ్ అంబాసిడర్ అయి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇక వెంకటేష్ మణప్పురం గోల్డ్ లోన్,రామరాజ్ బనియన్స్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.

నాగ చైతన్య సమంత దంపతులు,ఒకప్పటి నటుడు మురళీమోహన్,విలక్షణ నటుడు చలపతిరావు,ఇలా పలువురు నటీనటులు యాడ్స్ ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. బాలీవుడ్ లో అయితే ఎంపీగా వున్న హేమమాలిని వంటి వారు కూడా కూడా యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ విషయంలో ఏమీ తీసిపోలేదు. మరోపక్క లలితా జ్యుయలర్స్,శర వణం స్టోర్స్ వంటి సంస్థల యజమానులే తమ సంస్థలకు తామే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడం విశేషం.