Movies

రాజన్న సినిమాలో నటించిన యాని గుర్తుందా …. ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది టాలీవుడ్ లో నటించి, ఇంకా కొత్త వాళ్లు నటిస్తూ అలరిస్తుంటారు. కొందరు చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి, పెద్దయ్యాక కూడా స్టార్ లుగా నిలదొక్కుంటారు. ఇలా ఎప్పటికప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతుంటారు. అందులో కొద్దిమంది చెరగని ముద్ర వేస్తారు. అందులో నాగార్జున నటించిన రాజన్న మూవీలో నటించిన బేబి యాని గుర్తుండే ఉంటుంది. బేబి యాని అంటే తెలియక పోవచ్చేమో గానీ మల్లమ్మ అనగానే ఠక్కున గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క మూవీతోనే ఈ అమ్మాయి పాపులారిటీ తెచ్చేసుకుంది. అనుష్క, ప్రభాస్, కాజల్, నాగార్జున అంటే తనకు చాలా ఇష్టమని చెప్పే బేబి యానికు చోటా భీం యానిమేషన్ చిత్రాలంటే మరీ ఇష్టమట. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ,మలయాళ భాషా చిత్రాల్లో నటిస్తూ,సౌత్ ఇండియా చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరుగాంచింది.

సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంటున్న బేబి యాని ఇటీవల వచ్చిన రంగస్థలం మూవీలో హీరో రామ్ చరణ్ సోదరిగా నటించి,వారెవ్వా అనిపించింది. అన్నయ్య ఆది చనిపోయినప్పుడు చేసిన యాక్టింగ్ చూసి ఆమెకు మంచి ఫ్యూచర్ ఉందని చాలామంది కితాబిస్తున్నారు. మూడేళ్ళ వయస్సులో సినీ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పటికే తన నటనతో రెండు నంది అవార్డులు సొంతం చేసుకుంది.

ట్రాప్ అనే తెలుగు ఫిలిం లో నటించి అవార్డు అందుకుంది. గోరింటాకు అనే తెలుగు సీరియల్ లో అద్భుత నటనకు గాను, 201లో టివి నంది అవార్డు సాధించుకుంది. అనంతరం అతిధి, స్టాలిన్, ఏక్ నిరంజన్, విక్రమార్కుడు తదితర చిత్రాల్లో మంచి పేరు కొట్టేసింది. బేబి యాని సినీ బ్యాక్ గ్రౌండ్ ఏ మాత్రం లేకుండా, ‘అనగనగా ఓరోజు చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి,అనతికాలంలోనే స్టార్ అయింది. ఈమె ఫ్యామిలీ నిజానికి తెలుగువాళ్లు కాదు, మలయాళీలు. అయితే ఈమె పుట్టింది మాత్రం హైదరాబాద్ లోనే.

ఈమె పేరెంట్స్ ఉద్యోగ రీత్యా భాగ్యనగరంలో సెటిల్ అయ్యారు. బేబి యాని మలయాళంతో పాటు తెలుగు సూపర్ గా దంచేస్తోంది. ఇప్పటివరకూ 25 సినిమాల్లో నటించిన బేబి యాని చాలా పెద్ద పెద్ద నటులతోనే అంటే మెగాస్టార్ చిరంజీవి,మహేష్ బాబు, నాగార్జున,గోపీచంద్,రవితేజ,జగపతి బాబు, రామ్ చరణ్ తదితరులతో కల్సి వెండితెరను షేర్ చేసుకుంది.

ఇక ఈమధ్యనే ఓ భోజ్ పూరి చిత్రం శివలో నటించి మెప్పించింది. 2011లో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన రాజన్న మూవీతో అందరిచేతా ప్రశంసలు అందుకుంది. అందుకే ఈ మూవీ తన జీవితంలో అద్భుత చిత్రంగా బేబి అన్నే చెబుతూ ఉంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."