Movies

ఛార్మి పెళ్లి చేసుకోకపోవటానికి కారణం ఎవరో తెలుసా… సంచలన నిర్ణయం తీసుకున్న ముద్దుగుమ్మ

పంజాబ్ సిక్కు కుటుంబానికి చెందిన బొద్దుగుమ్మ ఛార్మి, ఒకప్పుడు తెలుగులో ఓ ఊపు ఊపేసింది. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పిన ఈ బ్యూటీ ముంబయిలో పుట్టి,అక్కడే పెరిగింది. టాలీవుడ్ లో అవకాశాలు సన్నగిల్లి, ఇప్పుడు ఫిలిం ప్రొడక్షన్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కల్సి పనిచేస్తోంది. అయితే ఇండస్ట్రీని ఊపేసిన డ్రగ్స్ కేసులో ఈ అమ్మడి పేరు వినిపించడం, సిట్ అధికారులు విచారించడం కూడా తెల్సిందే. ఈమె అసలు పేరు సురదీప్ కౌర్ ఉప్పల్, తండ్రి పేరు డీప్ సింగ్ ఉప్పల్. వ్యాపారస్తుల కుటుంబానికి చెందిన ఛార్మి ప్రాధమిక విద్యాభ్యాసం కార్పొరేట్ ఇంగ్లీషు మీడియం స్కూల్ లో చేసింది.

ఇక ఈ ముద్దుగుమ్మకు 14ఏళ్ళ ప్రాయంలోనే సినీ ఛాన్స్ దక్కింది. అయితే సెలవుల్లో మాత్రమే షూటింగ్ అని కండీషన్ మీద’నీతోడు కావలి’ అనే సినిమాకు పనిచేసిన ఛార్మి, ఆతర్వాత తమిళంలో ఓ సినిమా చేసినా పెద్దగా ఆడలేదు. దీంతో కృష్ణ వంశీ తెలుగులో తీసిన శ్రీ ఆంజనేయం చిత్రంలో నితిన్ సరసన నటించి, తన అందచందాలతో కట్టిపడేసింది.

ఈ సినిమాతో బ్రేక్ వచ్చిన ఈ పంజాబీ బ్యూటీపై టాలీవుడ్ కళ్ళు పడ్డాయి. ఇక వెనుదిరిగి చూడని ఛార్మి వరుస చిత్రాలతో బిజీ అయ్యింది. గౌరీ , మాస్,చక్రం, అనుకోకుండా ఓరోజు వంటి మూవీస్ ఆమెను హైలెవెల్ కి తీసుకెళ్లాయి. లక్ష్మి, స్టైల్, రాఖీ,వంటి చిత్రాలతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఛార్మి ఆ తర్వాత దిశ మార్చింది. తనకు ఇంపార్టెంట్ ఉంటేనే సినిమాలకు ఒకే చెప్పేది.

దాంతో మంత్ర, సుందరకాండ, మనోరమ వంటి లేడి ఓరియంటెడ్ మూవీస్ లో చేసిన ఛార్మి అదేసమయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తో డేటింగ్ చేస్తోందన్న వార్తలు వైరల్ అయ్యాయి. పెళ్లి కూడా చేసేసుకుంటున్నట్లు కూడా వార్తలు రావడంతో, దేవిశ్రీ సోదరుడు సాగర్,ఓ రోజు ఛార్మికి రాఖి కట్టేసి, ఊహాగానాలకు తెరదించాడు. ఆతర్వాత కొంతకాలం ఇండస్ట్రీలో నెట్టుకొచ్చిన ఛార్మికి హీరోయిన్స్ ఛాన్సులు పూర్తిగా తగ్గడం, అదే సమయంలో,డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా హిట్స్ లేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఇక ఇద్దరి ఐడియాలు ఒకేలా ఉండడంతో కనెక్ట్ అయ్యారు. దీంతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. పైకి పూరి వినిపించినా, దీని వ్యవహారాలు పూర్తిగా ఛార్మీయే చూస్తుంది. ఇక ఇద్దరి పేర్లు డ్రగ్స్ కేసులో వినిపించి నపుడు, తన భర్త ఛార్మి కారణంగానే పతనమయ్యాడని పూరి భార్య లావణ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించినట్లు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.

అయినా సరే పూరి, ఛార్మి ఫ్రెండ్స్ షిప్ ఏమాత్రం దెబ్బతినలేదు. ఇక పూరి డైరక్షన్ లో ఆయన తనయుడు ఆకాష్ హీరోగా ఛార్మి నిర్మాణ పర్యవేక్షణలో మెహబూబా చిత్రం కూడా వచ్చింది. పెళ్లి గురించి వార్తలు వచ్చినపుడు’నేను జీవితంలో ఒక్కసారే ప్రేమించా. అయితే అతనికి తగిన సమయం కేటాయించడం కుదరక ఆ బంధం తెంచుకున్నాను. ఇక లైఫ్ లో ఎవ్వరినీ పెళ్లి చేసుకోను. జీవితాంతం పేరెంట్స్ తో కల్సి వుంటాను’ అని ఛార్మి స్పష్టం చేసింది.