Movies

పవన్ వీరాభిమాని షకలక శంకర్ కి పవన్ సేంట్ మెంట్ ఎలా వర్క్ అవుట్ అయిందో చూడండి

తేరుకోలేని కష్టాల్లో వున్నప్పుడు దేవుడు ఏదో రూపంలో వచ్చి సాయం అందిస్తాడని చాలామంది అంటుంటారు. ఇది కొందరు నమ్మినా,నమ్మక పోయినా మరికొందరు గట్టిగానే నమ్ముతారు. ఇక షకలక శంకర్ విషయంలో ఇలాంటిదే జరిగింది. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లో హీరో రేంజ్ కి ఎదిగిన షకలక శంకర్ లేటెస్ట్ గా ‘శంభో శంకర’ కథానాయకునిగా ప్రస్థానం ప్రారంభించాడు. దీంతో బుల్లితెర హాస్య నటులకు స్ఫూర్తిగా నిలిచాడు. ఎందుకంటే హీరో అవ్వడానికి స్పెషల్ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదని మరోసారి చాటి చెప్పాడు. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరుగా రిలీజైన ‘శంభో శంకర’ మూవీ మొదటి రోజునుంచే కలెక్షన్స్ పంట పండిస్తూ,బాక్సాఫీస్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.

నిజానికి జూన్ 29న దాదాపు 10సినిమాలు రిలీజైతే అందులో కొన్నింటి సంగతి ఏమైందో కూడా తెలీని పరిస్థితి వచ్చిందంటే అందుకు నూటికి నూరుపాళ్లు ‘శంభో శంకర’ మూవీయే అని అంటున్నారు. ఆడియన్స్ తో పాటు సినీ వర్గాల చూపు అంతా షకలక శంకర్ పైనే ఉంది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ నిజానికి ఈ చిత్రం రిలీజ్ కి ముందు శంకర్ జీవితం ప్రమాదం అంచున చేరింది.

ఎందుకంటే ఈ మూవీ కన్నా ముందే డ్రైవర్ రాముడు చిత్రం పట్టాలెక్కినా అది తొలి దశలోనే….అసలు ఆ మూవీ ఏమైందో కూడా శంకర్ కి కూడా తెలీదు. కారణం ఓ పాట, ఓ ఫైట్ చిత్రీకరించిన ఈ మూవీకి సంబందించిన నిర్మాతలు చేతులెత్తేశారు. ఇలాంటి పరిస్థితుల్లో శంభో శంకర మూవీ తీయడానికి నిజంగా గట్స్ ఉండాలి. ఎందుకంటే తొలిసినిమా ఆగిపోయాక సెంటిమెంట్ ప్రకారం ఎవరూ ముందుకు రావడానికి సాహసించరు.

పైగా ఇండస్ట్రీలో అన్నీ నెగెటివ్ దృష్టితో చూస్తారు. ఇవన్నీ తట్టుకుని నిలబడి మరో సినిమా తీయాలంటే ఆషామాషీ కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు, రవితేజ ఇలా చాలామందిని ఎప్రోచ్ అయినా సరే ఎవరూ ముందుకు రాలేదు. ‘నీవు హీరోగా అయితే చాలా కష్టం. మరెవ్వరితోనైనా సరే , కానీ ఇప్పుడు మాత్రం కుదరదు. తర్వాత చూద్దాం ‘ఇలా ఆందరూ ఒకేవిధంగా మొహం మీదే చెప్పేసరికి తన నిర్మాతను తానె వెతుకున్నా ఫలితం లేకపోయింది.

ఇక చేసేది ఎలా అని షాక్ లో మునిగిపోయిన శంకర్ ని పవన్ కళ్యాణ్ వీరాభిమాని ముందుకొచ్చి ఆదుకున్నాడు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన పేరు మోసిన వ్యాపార వేత్త వై. రమణారెడ్డి ఈయన ఆదినుంచి మెగా ఫ్యామిలీ కి వీరభక్తునిగా ఉంటున్నాడు. ఇక పవన్ అంటే చచ్చేంత అభిమానం. షకలక శంకర్ కథ చెప్పిన వెంటనే హీరో ఎవరని ఆలోచించకుండా రెడీ అయ్యాడు.

పైగా మెగా ఫ్యామిలీకి అభిమాని,సినీ ప్రముఖుడు, సైన్ మ్యాగజైన్ ఎడిటర్ కొండేటి సురేష్ కూడా అండగా నిలిచాడు. దీంతో రమణారెడ్డికి అనుభవం లేకున్నా,సురేష్ కు ఉన్న అనుభవంతో సినీ నిర్మాణం స్టార్ట్ అయింది. ఈవిధంగా తనను ఆదుకోడానికి ఆ దేవుడు పవన్ కళ్యాణ్ అభిమాని రూపంలో నిర్మాతలను పంపాడని శంకర్ కన్నీటి పర్యంతమయ్యాడట.

ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయ్యి, విడుదల కూడా అనుకున్నట్టే జరగడం ఆ తర్వాత ఈ చిత్రం ఏ రేంజ్ కి చేరిందో తెల్సిందే. కేవలం మూడు రోజుల్లోనే 7కోట్లు గ్రాస్ వసూలు చేసిందంటే శంభో శంకర స్టామినా ఏమిటో చెప్పక్కర్లేదు. చిన్న చిత్రాల్లో సంచలనంగా నిలిచింది. అసలు షకలక శంకర్ మూవీ ఎవరు చూస్తారనే వారికి ఈ మూవీ కలెక్షన్స్ సమాధానమని సినీ విమర్శకుల అంటున్నారు.