Movies

ఎన్టీఆర్ తో జోడి కట్టిన సమీరా రెడ్డి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు

అవును ఒకప్పుడు ఈమెతో జూనియర్ ఎన్టీఆర్ లవ్ ట్రాక్ బానే నడిపాడని పలు కథనాలు వైరల్ అయ్యాయి. ఆమె ఎవరో కాదు సమీరా రెడ్డి. ఈమె ఇప్పుడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు ఈమెను ఎవరైనా చూస్తే, ‘అయ్యో ఇలా అయిపోయిందేంటి. ఈమేనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు తెరను ఏలింది ‘ అని అనక మానరు. అంత గొప్ప అందగత్తె ఇలా ఉందా అని అందరూ ముక్కున వేలేసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ లవర్ గా తెలుగులో పేరుతెచ్చుకుని బాలీవుడ్ , టాలీవుడ్ లలో పలు హిట్ చిత్రాల్లో నటించిన సమీరా ఇప్పుడు పెళ్ళై, పిల్లలుండి ఎలా మారిపోయిందో చూసి అందరూ షాకవుతున్నారు.

కళావిహీనంగా మారిన సమీరా రెడ్డి ఫోటోలు వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది. స్వతహాగా తెలుగు మూలాలు గల హైదరాబాద్ నటి అయిన సమీరా బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టి జూనియర్ ఎన్టీఆర్ సరసన అశోక్ మూవీలో నటించి అదరగొట్టింది. అనంతరం ఎన్టీఆర్ తోనే నరసింహుడులో నటించిన ఈమె, ఆతర్వాత చిరంజీవితో జై చిరంజీవలో నటించింది.

గతంలో ఎన్టీఆర్ రెండు సినిమాల్లో అవకాశం రావడంతో ఆమెతో ప్రేమాయణం సాగించినట్లు పుకార్లు షికారు చేశాయి. 2014లో అక్షయ్ వార్ధా అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్న ఈ అందగత్తె ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.ఓ కుమారుడికి జన్మనిచ్చిన సమీరా పెళ్లయ్యాక ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.

ఫంక్షన్ లకు సైతం రావడం లేదు. భర్త ఆర్ధికంగా కుంగిపోవడంతో ఆమె పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయిందని టాక్ వినిపిస్తోంది. ఎంతో అందంగా ఉండే సమీరా ఈ ఐదేళ్లలో పూర్తిగా మారిపోయి ఈమేనా అనిపిస్తోంది. ఎక్కడైనా కనిపిస్తే ఠక్కున గుర్తుపట్టడం కష్టమే. తాజాగా విడుదలైన ఫోటో చూస్తే ఈమేనా సమీరా అనిపించక మానదు. ఇది చూసి ఆశ్చర్య పోనివారు లేరు.