Movies

కోట్ల రూపాయిల ఉద్యోగాన్ని వదిలి సినిమాల్లోకి వస్తున్న విజయ్ దేవరకొండ తమ్ముడు…ఎందుకో తెలుసా?

నటన ఎవరి సొత్తు కాదు .. అదో కళా తృష్ణ… తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఎందరో ప్రయత్నాలు చేస్తూనే వున్నారు .. మరికొందరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే నటులైపోయి, స్టార్ గా ఎదుగుతారు. ఏదైతేనేం … ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ గా ఎదిగిపోయాడు. ఎందుకంటే టాలీవుడ్ లో సునామీలా సెన్షేషన్ సృష్టించిన స్టార్ ఇతడే. ముందుగా ఎలాంటి అంచనాలు లేకుండానే బంపర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ సినిమాతో ఒక్కసారిగా యూత్ ఐ కాన్ అయిపోయిన విజయ్ దేవరకొండ, నిజానికి పెళ్ళిచూపులుతో గుర్తింపు తెచ్చుకోకముందే చాలా మూవీస్ లో చిన్నా చితకా రోల్స్ తో నెట్టుకొచ్చాడు. అయితే, అప్పటివరకూ వేషాలకోసం పడిగాపులు పడిన విజయ్ ని అర్జున్ రెడ్డి మూవీ రాత్రికి రాత్రే అతని కెరీర్ ని మార్చేసి, అతని కోసం ఫిలిం మేకర్స్ క్యూలో నిలబడేలా చేసింది.

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనే స్థాయినుంచి, ఒకేసారి చేతిలో ఐదారు సినిమాలతో బిజీ గా మారిపోయిన క్రేజీ హీరో విజయ్ ఇప్పుడు తన సోదరుణ్ణి కూడా మూవీస్ లోకి తీసుకురాబోతున్నాడు. అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ చదువులో టాప్. వరల్డ్ లోనే చాలా ఫేమస్ యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ యూనివర్స్ నుంచి మాస్టర్ డిగ్రీ అందుకున్న ఆనంద్,గతంలో ఎం ఏ ఎస్సార్ గ్రూప్ లో పనిచేసాడు.

ఇక అమెజాన్ సెంటర్ లో వచ్చిన జాబ్ తో కళ్ళు తిరిగే జీతం అందుకుంటున్నాడు. ఎక్నాలజీ రిస్క్ కన్సల్టెంట్ గా డెలాయిట్ లో పనిచేస్తున్న ఆనంద్ కి తన అన్నలా నటుడవ్వాలని కోరిక అతన్ని ఈ రంగానికి రప్పిస్తోంది. తనకు మూవీలో నటుడవ్వాలనే కోరిక కలగడానికి తండ్రి, సోదరులేనట.

తండ్రి సివిసి నిర్మిస్తుండగా,విజయ్ హీరోగా నిలదొక్కున్నాడు. పైగా చిన్ననాటినుంచి నటనపై ఆసక్తి కూడా మెండుగా పెంచుకున్న ఆనంద్,తానూ అన్నలా ఎందుకు కాకూడదని, ఏటా కోటి రూపాయల జీతం వదులుకుని మరీ ఇండస్ట్రీకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఓ పక్క ఉద్యోగం చేస్తూనే, మరోపక్క నటనతో శిక్షణ పొందుతున్నాడు.

ఫిలిం మేకింగ్ లో 24క్రాఫ్ట్స్ గురించి కూడా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. ప్రస్తుతం హీరోలా కనిపించడానికి ఫిట్ నెస్ కూడా ట్రైనర్ సాయంతో పెంచుకుంటున్నాడు. యూత్ ఫుల్ స్టోరీతో ఆరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆనంద్ ని హీరోగా పరిచయం చేస్తూ, మూవీ తీయడానికి విజయ్ కి సన్నిహితంగా ఉండే ఓ ప్రొడ్యూసర్ సమాయత్తం అవుతున్నాడట.