Movies

బాబు గోగినేని ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…ఎలా సంపాదించారో తెలుసా?

హేతువాదిగా, మానవహక్కుల నేతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నా, కేవలం కొన్ని వర్గాలకే తెల్సిన బాబు గోగినేని ఇప్పుడు టివి ప్రేక్షలకు బాగా దగ్గరయ్యాడు. బిగ్ బాస్ సీజన్ టు లో హౌస్ మెంబర్ గా చోటు దక్కించుకుని ఇప్పుడు అందరి దృష్టిలో పడ్డాడు. కొద్దికాలంలోనే సినీ సెలబ్రిటీస్ ని మించిన పాపులారిటీ బాబు గోగినేనికి వచ్చేసింది. మూఢ నమ్మకాలపై తనదైన శైలిలో కౌటర్ ఇస్తూ హిందూ వాదులకు కంటగింపుగా మారిన బాబు గోగినేని ఎన్నో మానవ హక్కుల ఉద్యమాలు నడిపారు. అయితే ఈయన గొప్ప విద్యావేత్త అని అందరికీ తెలీదు. బాబా పారాడిజం లో మాస్టర్ డిగ్రీ ఆయన సొంతం. బాబు గోగినేని విద్యాభ్యాసం అంతా ఇండియాలోనే జరిగినా,ఉద్యోగాలన్నీ విదేశాల్లోనే సాగించారు.

ఇక తండ్రి నుంచి పెద్ద ఎత్తున ఆస్తిని వారసత్వంగా అందుకున్నట్టు భోగట్టా. బాబు తాతగారు తెనాలిలో వందల ఎకరాలు ఎమ్మేసుకుని బోధన్ లో స్థిరపడ్డారు. అయితే బాబు గోగినేని తండ్రి గిరిబాబు ఉద్యోగం వదిలేసి బాబుకు హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. ఇక బాబు చదువు పూర్తయ్యాక లండన్ లో చాలాకాలం పాటు ఫ్రెంచ్ క్లాసులు చెప్పి లక్షల పౌండ్లు పోగేశారు.

ఎందుకంటే అప్పట్లో బాబు దగ్గర ఫ్రెంచ్ క్లాసులు నేర్చుకోడానికి విద్యార్థులతో పాటు స్థానికులు కూడా క్యూ కట్టేవారట. ఓ వైపు టీచింగ్ క్లాసులు సాగిస్తూనే మరోవైపు మానవహక్కుల ఉద్యమాలు చేపట్టిన బాబు, మూఢ నమ్మకాలపై పోరాటం కోసం కోట్ల రూపాయల ఫండ్ రైజింగ్ చేసారు. తర్వాత ఇండియా వచ్చిన బాబు తన మేధాశక్తితో సాఫ్ట్ స్కిల్స్ బోధించే వ్యాపారం స్టార్ట్ చేసారు.

లైఫ్ స్కిల్స్ అనే సంస్థను నెలకొల్పి ఫ్రెంచ్,జర్మన్,స్పానిష్, జపనీస్ భాషలలో ఐటి నిపుణులకు స్కిల్స్ నేర్పిస్తూ,స్కిల్ గురువుగా పేరుతొ పాటు భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇక బాగా ఉన్న కుటుంబం నుంచే వచ్చిన బాబు భార్య సహన గతంలో కొన్ని మూవీస్ లో నటించింది.