Movies

శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు

క్రమశిక్షణకు ప్రతిభ జోడిస్తే,ఎలాంటి ఫలితాలు వస్తాయో, అందుకు టాలీవుడ్ లో స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి తార్కాణం. ఇటు సినీ ఇండస్ట్రీలో అటు రాయకీల్లో కూడా వివాద రహితునిగా వెలుగొందుతున్న చిరంజీవి సాధించిన రికార్డులు, అవార్డులు మరెవ్వరూ టచ్ చేయలేకపోయారంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. సినీ కెరీర్ లో ఆయన నెలకొల్పిన పద్దతి,ఆచరించిన విధానం స్ఫూర్తిదాయకం. చిరు ఫామిలీకి చెందిన ఎందరో సినీ పరిశ్రమలో ఉన్నారంటే అందుకు చిరంజీవి చలవే అని చెప్పకతప్పదు. ఇంట్లో వ్యక్తులనే కాదు బయట వ్యక్తులను కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహించడం ఆయన నైజం. ఇక ఆయన చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత మూవీ తెరకెక్కిన సంగతి తెల్సిందే.

అల్లునిలో గల ఈజ్ ని గుర్తించిన చిరంజీవి సినిమాల్లో యాక్ట్ చేయాలని సూచించడం,దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ విజేత మూవీలో నటించడం జరిగిపోయాయి.వాస్తవానికి కళ్యాణ్ దేవ్ సినీమా యాక్టర్ కావాలని ఏనాడూ అనుకోలేదు. అంతదాకా ఎందుకండీ మెగాస్టార్ చిరు అల్లునిగా ఆ ఇంట్లో అడుగుపెడతానని కల్లో కూడా ఊహించలేదు.

చిరు చిన్న కుమార్తె శ్రీజ బాల్య స్నేహితుడు కళ్యాణ్ దేవ్ చివరకు ఆమెకు భర్త అవ్వడం విధి వైచిత్రమే. చిత్తూరు కళ్యాణ్ స్వస్థలం, అతని తల్లిదండ్రులు కానుగంటి కిషన్ దేవ్,జ్యోతి. కిషన్ దేవ్ దేశవిదేశాల్లో వ్యాపారాలు సాగిస్తూ,కోట్లాది రూపాయల టర్నోవర్ సాధించాడు. తెలుగు రాష్ట్రాల్లో వారికున్న ఆస్తులు వందల కోట్లలో ఉంటాయని బోగట్టా.

ఎందుకంటే, ఒక్క చిత్తూరు జిల్లాలోనే వారికి బోల్డన్ని ఫ్యాక్టరీలున్నాయి. కూర్చుని తిన్నా, తరతరాలకు తరగని ఆస్తి ఉన్నాసరే,విదేశాల్లో ఉద్యోగం చేసి,స్వశక్తిని నమ్ముకున్నాడు.టెక్నాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లలో మాస్టర్ డిగ్రీ అందుకున్న కళ్యాణ్ కష్టం విలువ ఏమిటో తెలియాలని ఉద్యోగం చేసాడు. ఇక చిన్ననాటి స్నేహితురాలు శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకుని, చాలాకష్టాలు పడి చివరకు విడాకులు తీసుకుందని తెల్సి చలించిపోయిన కళ్యాణ్ దేవ్,ఎలాగైనా శ్రీజను మ్యారేజ్ చేసుకుని కొత్తజీవితం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

అన్నీ అనుకున్నట్టే జరగడంతో మెగా ఫ్యామిలిలో కళ్యాణ్ మెంబర్ అయ్యాడు. అంతవరకూ ఒకలెక్క అయితే, ఇక అతనిలో ఓ మంచి నటుడున్నాడని శ్రీజ తల్లి, చిరు భార్య సురేఖ గుర్తించిందట. మెగాస్టార్ కూడా మనస్ఫూర్తిగా అంగీకరించడంతో పాటు ,తన హిట్ మూవీ విజేత టైటిల్ కూడా ఇచ్చేసాడు ఇంకేముంది ఆవిధంగా కళ్యాణ్ దేవ్ సినీ ఎంట్రీకి బీజం పడింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంతో తన చిన్న అల్లుడు కూడా సొంత ఇమేజ్ తో టాలీవుడ్ లో నిలదొక్కుకుంటాడని అందరూ భావిస్తున్నారు.