Movies

సంచలనం సృష్టిస్తున్న ఈ ఫొటోలో మెగా హీరోని గుర్తు పట్టారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం. చాలా అరుదు. పైగా ఈమధ్య రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టాక సమాజ సమస్యలు, తన అభిప్రాయం,డిమాండ్ ఇలా పలు అంశాలకే పూర్తి ప్రాధాన్యత ఇస్తూ పోస్ట్ పెడ్తున్న సంగతి తెల్సిందే. కానీ ఇప్పుడు ఓ ఫోటో తీవ్ర సంచలనం రేపుతోంది. అది పవన్ చిన్నప్పటి ఫోటో. పైగా అందులో తన సోదరులు చిరంజీవి, నాగబాబు,తన ఇద్దరు సోదరి లు కూడా ఉండడం విశేషం. ఈ ఫోటో చూసాక విశ్లేషణలు మొదలయ్యాయి. నిజానికి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసాక చిరంజీవితో పవన్ దూరం పాటిస్తూ వచ్చాడు. అయితే ఇటీవల మళ్ళీ చిరుకి

దగ్గరవుతున్నారు. అన్నయ్య గురించి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాడు.అలాగే మెగా ఫ్యామిలీ సభ్యులంతా చిరుకి చేరువ అవుతున్నారు. ఈ తరుణంలో తాజాగా పవన్ పెట్టిన ఫోటో ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాల కాలం నాటి ఆ ఫొటోలో ఉన్న పవన్ అప్పటికి 7వ తరగతి చదుతున్నాడు. నెల్లూరులో చదువుకుంటున్నప్పుడు తీసిన ఫోటో అని పవన్ వెల్లడించాడు. చిరు నలుపు చొక్కాలో , నాగబాబు తెలుపు చొక్కాలో మురిసిపోతున్నారు. చిరు అప్పటికే హీరోగా రాణిస్తున్నాడు.

ఇక నిక్కరు, చొక్కాతో గల పవన్ చాలా డల్ గా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అప్పుడే దీర్ఘకాలిక శ్వాస కోశ వ్యాధినుంచి పవన్ కోలుకున్నాడట. ఈ ఫోటో మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇలా తన చిన్ననాటి ఫోటో పెట్టి, పవన్ వ్యక్తిగత విషయం పంచుకోవడం సహజంగానే అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇక మెగా అభిమానులంతా వచ్చే ఎన్నికలనాటికి పవన్ వెనుక నడిచేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెగా అభిమానుల్లో ఏమాత్రం చీలిక లేకుండా, అందరూ ఒక్కతాటిపై నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈమధ్య వ్యవహారాలు చూస్తుంటే అనిపించక మానదు.