Movies

షాక్ ఇచ్చిన తేజస్వి…ఆందోళనలో సామ్రాట్… అసలు ఏమి జరుగుతుంది

మాంచి జోష్ గా సాగుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బిగ్ బాస్ సీజన్ 2లో గురువారం కూడా లవ్ డ్రామాలు కొనసాగాయి. హౌస్ మెంబర్స్ ప్రేమ ప్రభంజనంలో తేలియాడారు. తేజస్వి- సామ్రాట్ లు గురువారం కూడా ఈ అవకాశం వినియోగించుకున్నారు. దీప్తి – కౌశల్, ,దీప్తి సునయన – రోల్ రైడా,తనీష్ – నందిని,అమిత్ – భానుశ్రీ జంటలు యాక్టివిటీ రూమ్ లో డ్యూయెట్స్ తో అదరగొట్టారు. హౌస్ మేట్స్ తో తనకు ఏర్పడిన విబేధాల గురించి తేజస్వి తన పుట్టినరోజు సందర్బంగా వెల్లడిస్తూ, ఇకపై తాను అందరితో బాగా ఉంటూ ప్రేమాభిమానాలు చూపిస్తానని ప్రకటించింది. నిజానికి ఈ హౌస్ లోకి వచ్చాక గేమ్ మూడ్ లోనే ఉన్నానని అయితే ఇప్పుడు చూసాక మారాలని అనిపిస్తోందని చెప్పుకొచ్చింది.

ఇక బిగ్ బాస్ ఇచ్చిన లవ్ హాస్టల్ టాస్క్ లో భాగంగా వార్డెన్లు,సెక్యూరిటీలకు దొరక్కుండా తేజు,సామ్రాట్ లు దాక్కోడానికి ప్రయత్నించారు. అందుకే రెండు పడకల మధ్య ఖాళీలో దుప్పటి కప్పేసుకుని పడుకున్నారు.

అయితే వార్డెన్ గీతా మాధురి వీళ్ళని కనిపెట్టేసి ‘మీకోసం బాత్ రూమ్ లో వెతుకుతున్నా,ఇక్కడున్నారా, కొంచెం ఆలస్యమైతే ఇంకేమి జరిగేదో’అని చురక అంటించింది.

ఇక తేజ్ ఐ లవ్ యు ప్రమోషన్ లో భాగంగా హీరో సాయి ధర్మ తేజ్,హీరోయిన్ అనుమప పరమేశ్వరన్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసారు.
బిగ్ బాగ్ హౌస్ లోకి ముందుగా హీరో సాయి ధర్మ తేజ్, ఎంటరవ్వగా, సభ్యులు స్వాగతించారు. ఇక బావ బావ అంటూ తేజ్ ని తేజస్వి ఆటపట్టిస్తూ, బావ నాకు కేకు తెలీదా అని వయ్యారాలొలుకుతూ అడిగేసరికి తేజ్ సిగ్గుపడిపోయాడు.

ఇక హీరోయిన్ అనుమప పరమేశ్వరన్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో సభ్యులు స్వాగతం పలికి, ఆ ఐదరితో ముచ్చట్లు మొదలెట్టారు. తాను పూర్తిస్థాయి లవ్ స్టోరీ తో కూడిన సినిమాలో నటించానని,ఈ సినిమా చాలా బాగుంటుందని సాయి ధర్మ తేజ్ చెప్పుకొచ్చారు. ఇక, తేజ్ , అనుపమల కోసం బిగ్ బాస్ ఓ కేక్ పంపారు. హౌస్ మెంబర్స్ తో కల్సి గార్డెన్ ఏరియాలో తేజ్ , అనుమప కట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ హౌస్ మెంబర్స్ కి బై చెప్పేసి అక్కడనుంచి వెళ్లిపోయారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."