Movies

ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్న సమంత…షాక్ లో నాగచైతన్య

సమంత టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్. నిన్నటికి నిన్న రంగస్థలం , మహానటి చిత్రాల్లో ఆమె చేసిన నటన సూపర్బ్. ఈ రెండు చిత్రాల్లో రెండు విభిన్న పాత్రలతో మెప్పించిన సమంత ఎన్నో హిట్ చిత్రాలతో తన ఇమేజ్ తారాస్థాయికి చేర్చుకుంది. అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించి, పెళ్లి చేసుకున్న ఈమె అక్కినేని వారి కోడలయ్యాక కూడా సినిమాల్లో తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం తెలుగులో యూటర్న్ రీమేక్, తమిళంలో సెమ్మరాజ్ సూపర్ డీలక్స్ ఆమె నటిస్తున్నారు.ఇది కాకా ‘నిను కోరి’ శివ నిర్వహణ డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా తీయబోయే చిత్రంలో కూడా సమంత నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇవి తప్ప కొత్తగా ఏ ప్రాజెక్ట్ లు ఆమె ఒప్పుకోవడం లేదట. దీంతో 2019మార్చికల్లా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేసి, ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలని ఆమె యోచిస్తోందట. సినిమాల నుంచి తప్పుకోవాలని ఆమె అనుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చినా ఇప్పట్లో సినిమాలు చేయడం ఆపబోమనని కొన్నాళ్ల క్రితం స్పష్టం చేసింది. అయితే ఆమె అలా చెప్పడం ద్వారా వచ్చే ఏడాది దూరం కానున్నట్లు చెప్పకనే చెప్పిందని అంటున్నారు.

ఇక వచ్చే ఏడాది సినిమాలకు గుడ్ బై చెప్పాలన్నది తాత్కాలికమా, శాశ్వతమా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఆమె వచ్చే ఏడాది నుంచి సినిమాల నుంచి తప్పుకోనున్నట్లు వస్తున్న సంచలన కథనం పై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.