Movies

మాస్టర్ భరత్ గుర్తు ఉన్నాడా…. ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించడం ఓ లెక్క అయితే, ఆ తర్వాత పెద్దయ్యాక నిలదొక్కుకోవడం మరో లెక్క. ఎందుకంటే, నట వారసత్వం లేకుండా చైల్డ్ కేరక్టర్ల మెప్పించిన ఆలీ,పెద్దయ్యాక కమెడియన్ గా రాణించడానికి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే కోవలో మొన్నటి వరకూ చైల్డ్ ఆర్టిస్ట్ గా దుమ్ము రేపిన మాస్టర్ భరత్ ఇప్పుడు నూనూగు మీసాలతో నవయువకునిగా మెరిసిపోతున్నాడు. ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా న్యూలుక్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వెంకీ, పోకిరి, దుబాయ్ శ్రీను, రెడీ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న మాస్టర్ భరత్ పూర్వికులు తెలుగువాళ్లే. కానీ చాలకాలం క్రితమే తమిళనాడు వెళ్లి సెటిల్ అయ్యారు. 2002లో వచ్చిన నయన తమిళ మూవీ ద్వారా చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చిన మాస్టర్ భరత్, ఆ తర్వాత ఆనంద ఆనంద మాయే మూవీ తో తెలుగు పరిశ్రమలో ఆరంగేట్రం చేసి, టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.

చిన్నవాడైనా కామెడీ యాక్టర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా నటించడంతో భరత్ కి అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఇక తన దగ్గరకు వచ్చిన ప్రతి సినిమాకు ఒకే చెప్పడంతో అతి తక్కువ సమయంలో చిన్న వయసులోనే 50 సినిమాలు చేసేసాడు. చెన్నై స్కూల్ లో చదువుతుండగా అతడు వేసిన నాటకాలు చూసిన ఏవిఎం పెద్దలు, అతనికి బుల్లితెరపై ఛాన్స్ ఇచ్చారు.

అక్కడ నుంచి నెమ్మదిగా వెండితెరకు దూసుకొచ్చిన భరత్, తెలుగు – తమిళ చిత్రాలలో నటించి బాల నటుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. వాస్తవానికి భరత్ ని ఓ డాక్టర్ గా చూడాలని అతని తల్లిదండ్రుల ఆకాంక్ష. అయితే అనుకోకుండా ఛాన్స్ లు రావడం, సౌత్ ఇండియా లెవెల్లో అద్భుతమైన రెస్పాన్స్ పొందడంతో చివరికి వాళ్ళు కూడా అతన్ని సినిమాల్లో ఎంకరేజ్ చేసారు.

ఇక పెరిగే వయస్సులో ఎక్కువకాలం బాల నటుడిగా నిలబడే పరిస్థితి ఉండదని అర్ధంచేసుకున్న భరత్, అల్లుడు శ్రీను తర్వాత సినిమాలకు దూరంగా జరిగి, ఇక చదువుపై దృష్టి పెట్టాడు. ఇక మళ్ళీ తెలుగు తెరపై న్యూ లుక్ తో రీ ఎంట్రీ ఇవ్వడానికి సమాయత్తం అయ్యాడు. అల్లు శిరీష్ హీరోగా నిర్మించే, ఎబిసిడి చిత్రంతో హీరోకి ఫుల్ లెన్త్ రోల్ తో ఫ్రెండ్ పాత్ర పోషించనున్నాడు.

ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి పునరాగమనం చేస్తున్న భరత్, ఇది తనకు కొత్త జీవితం లాంటిదని అంటున్నాడు. ఇకనుంచి ఫ్రెండ్ పాత్రలతో పాటు విభిన్న పాత్రలను పోషిస్తానని, అయితే నిర్మాతలు, దర్శకులు తనకు తగ్గ రోల్స్ ఇచ్చి ప్రోత్సహించాలని కొరుకుతున్నాడు.