Movies

తేజ్ I LOVE YOU మొదటి రోజు కలెక్షన్స్ బట్టి తేజ్ సేఫ్ జోన్ లోకి వచ్చాడా?

మెగాస్టార్ ఫ్యామిలిలో ఎందరో నటులు వచ్చారు. ఇంకా వస్తున్నారు కూడా . ఇక హీరో సాయి ధర్మ తేజ్ హీరోగా తొలిప్రేమ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కరుణాకరన్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన తేజ్ ఐ లవ్ యు మూవీ మంచి టాక్ అందుకుంది. అనుమప పరమేశ్వరన్ ,హీరోయిన్ గా నటించిన ఈ మూవీ పై మొదటినుంచి భారీ అంచనాలే వున్నాయి. పైగా వరుస ప్లాప్ ల తర్వాత సాయి ధర్మ తేజ్ చేసిన ఈ మూవీ ని డైరెక్టర్ కరుణాకరన్ యూత్ కి తగ్గట్టు లవ్ ఎంటర్ టైన్ తీర్చిదిద్దాడని అందరూ ముందు నుంచే అంచనాలు ఏర్పరచుకున్నారు. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీకి పోస్టర్ టాక్ బానే వినిపిస్తోంది. గత కొంతకాలంగా హిట్ టాక్ లేకుండా నానా యాతన పడుతున్న తేజ్ కి ఇది ఊరట నిచ్చిందని అంటున్నారు సినీ క్రిటిక్స్. సుప్రీం తర్వాత సాయి ధర్మ తేజ్ చేసిన ప్రతి చిత్రం డిజాస్టర్ లెవెల్లో దెబ్బతీశాయి.

తిక్క, విన్నర్, జవాన్,ఇంటిలిజెంట్ ఇలా ప్రతిసినిమా ఒకదాన్ని మించి మరొకటి నైరాశ్యంలోకి నెట్టేశాయి. అటు నిర్మాత నష్టపోవడం, ఇటు హీరోగా సాయి ధర్మ తేజ్ దెబ్బతినడం జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తేజ్ ఐ లవ్ యు మూవీ పైనే ఆశలన్నీ తేజ్ పెట్టుకున్నాడు. గతంలోకి వెళ్తే,తేజ్ గత చిత్రం ఇంటిలిజెంట్ ఓపెనింగ్ డే కేవలం రెండు కోట్ల రూపాయల గ్రాస్ తో సరిపెట్టుకుంది.

దీంతో కనీసం 50లక్షల రూపాయలు కూడా రీచ్ కాలేదు. ఇక తేజ్ ఐ లవ్ యు చిత్రం తేజ్ ముఖాన నవ్వులు విరిసేలా చేసింది. వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ మూవీ మొదటి రోజు మూడు కోట్ల 50లక్షలు గ్రాస్ వసూలు చేసి, గత చిత్రాలకన్నా పర్వాలేదనిపించింది. అసలు ఈ మూవీకి 15కోట్లు ఖర్చు కాగా, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల రూపంలో దాన్ని రీచ్ అవ్వడంతో నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వచ్చేసారు.

ఇక శాటిలైట్ రైట్స్ , డిజిటల్ కంటెంట్ రైట్స్ అదనం కనుక మొత్తం వీటి ద్వారా 9కోట్ల 50లక్షల రూపాయల వరకూ నిర్మాతలకు ముట్టిందని భోగట్టా.ఇక పంపిణీ దారులైన డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఒకటి రెండు వారాల్లో లాభాల బాటలోకి వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలవారు అంటున్నారు. ఇక వీకెండ్ లో తేజ్ ఐ లవ్ యు మూవీ ఎలా వసూలు చేస్తుందో అనే దానిపై డిస్ట్రిబ్యూటర్ల భవిష్యత్తు తేలనుంది.

దీనికి కారణం ఏమిటంటే గోపీచంద్ హీరోగా వచ్చిన పంతం మూవీ ఓ రోజు ముందు రిలీజ్ కావడం, తొలిరోజు నాలుగు కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేయడం, అన్ని వర్గాలను అలరించే కమర్షియల్ మూవీగా మంచి టాక్ తెచ్చుకోవడం గురించి ఇప్పటికే రివ్యూలు చెబుతున్నాయి. దీంతో గోపీచంద్ టీమ్ ఆనందంలో ఉండగా, అదేసమయంలో తేజ్ ఐ లవ్ యు వసూళ్లు కాస్తంత తక్కువగా రావడం చిత్ర వర్గాలను కొంత ఆందోళన కు గురిచేస్తున్నాయి. అయితే లాంగ్ రన్ లో యూత్ నుంచి తేజ్ ఐ లవ్ యు కి బానే రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.