Movies

సోనాలి బింద్రే క్యాన్సర్‌పై స్పందించిన నాగ్…. ఏమన్నారో తెలుసా?

షోషల్ మీడియాలో అందాల నటి సోనాలి బింద్రే గురించి వచ్చే వార్తలపైనే ఇప్పుడు అందరూ చర్చ సాగిస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున,మహేష్ బాబు,బాలకృష్ణ వంటి అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ స్టార్ హీరోయిన్, పెళ్లయ్యాక సిల్వర్ స్క్రీన్ కి దూరంగా జరిగింది. అయితే సోషల్ మీడియా ద్వారా ఓ షాకింగ్ విషయం వెల్లడించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. క్యాన్సర్ కి గురైన సోనాలి, ప్రస్తుతం న్యూయార్క్ లో చికిత్స పొందుతున్న తాను చివరిదాకా పోరాడతానని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కేవలం అభిమాన జనానికే కాకుండా సినీ ప్రముఖులను సైతం విస్మయానికి గురిచేసింది. త్వరగా కోలుకుని తిరిగి స్వదేశానికి రావాలని అందరూ సందేశాలు కూడా పంపిస్తూ,ధైర్యం చెబుతున్నారు.

ఇక సోనాలితో మన్మధుడు గా నటించిన కింగ్ నాగార్జున కూడా ఓ ట్వీట్ ద్వారా సోనాలి తొందరగా కోలుకోవాలని పేర్కొన్నాడు. ‘ నువ్వు త్వరగా కోలుకోవాలి. నీ ఆత్మ విశ్వాసానికి మరింత బలం చేకూరాలని అనుకుంటున్నా డియర్’అంటూ నాగ్ ట్వీట్ చేసాడు.

తనతో కల్సి నటించిన హీరోయిన్స్ తో ఎప్పుడూ ఎటాచ్ మెంట్ లో ఉంటూ, వారితో ఆత్మీయ అనుబంధం మెయింటైన్ చేసే,నాగార్జున,తనతో మన్మధుడు మూవీలో కల్సి నటించిన సోనాలి అంటే ఏంతో అభిమానం వుంది. అందుకే సోనాలి కాన్సర్ బారిన పడిందని తెల్సి నాగ్ చాలా నిస్సాహాయతకు గురయ్యాడట.

తన తండ్రి అక్కినేని క్యాన్సర్ కి గురై , తమకు దూరం అయ్యారని నాగ్ పేర్కొంటూ, సోనాలి ఇప్పుడు క్యాన్సర్ కి గురవ్వడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని ఆవేదన చెందాడు. సోనాలి మంచి మనిషని, ఆమె వల్ల మన్మధుడు సక్సెస్ అయిందని నాగ్ చెప్పాడు. ఇక సోనాలి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగ్ అద్భుత సపోర్ట్ అందించారని అంటున్నారు