Movies

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి వ్యాపారం చేసి ఎంత సంపాదిస్తుందో తెలుసా?

టాలీవుడ్ అగ్ర హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. ఫామిలీ మెంబర్స్ మొదలు అభిమానుల దాకా అందరూ ముద్దుగా బన్నీ అని పిలుస్తారు. మెగాస్టార్ చిరు మేనల్లుడుగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకుగా అందరికీ తెల్సిన బన్నీ ఇప్పుడున్న హీరోల్లో డాన్సింగ్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎంత కష్టమైనా స్టెప్ అయినా సరే చిటికెలో అర్జున్ చేసేస్తాడని టాలీవుడ్ లో కొరియో గ్రాఫర్లు అందరూ చెప్పుకునే మాట. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అయినా, కొద్దీ కాలానికే సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో బన్నీని ఫాలో అయ్యేవాళ్ళు లక్షల్లో వుంటారు. ఇటీవల వచ్చిన తాజా మూవీ నా పేరు సూర్య విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ప్రతి సినిమాకు 100 శాతం ఎఫర్ట్ పెట్టె అల్లు అర్జున్ తో మూవీ తీయాలని ప్రతి దర్శకుడు కోరుకోవడంలో అతిశయోక్తి లేదు.గంగోత్రి మూవీతో హీరోగా సినీ ప్రస్థానం ప్రారంభించిన అల్లు వారబ్బాయి ఆర్య మూవీతో స్టార్ డమ్ అందుకున్నాడు. బన్నీ,హ్యాపీ,దేశముదురు,వేదం ఇలా ఒక్కో సినిమాకు తన ఇమేజ్ రెట్టింపు చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ హీరో పక్కా ఫామిలీ టైప్ అని చెప్పుకోవాలి.

ఒకప్పుడు పబ్ కల్చర్ లో మునిగి తేలిన బన్నీ పెళ్లయ్యాక పూర్తిగా మారిపోయాడు. ఒక పార్టీలో కల్సిన స్నేహారెడ్డి తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇక స్నేహా రెడ్డి గురించి చెప్పుకుంటే ఆమె తండ్రి కెపి ఎస్ రెడ్డి తెలంగాణాలో పెద్ద విద్యావేత్త. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపార వేత్త కూడా. ఒకదశలో పెద్దఎత్తున భూములు కొన్న కెపిఎస్ రెడ్డి ఆతర్వాత రియల్ ఎస్టేట్ ద్వారా భూములు విక్రయించి వేలకోట్లు సంపాదించాడు.

దాంతో 20ఏళ్ళ క్రితం సాధారణంగా ఉన్న స్నేహారెడ్డి కుటుంబం ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తింది. దాంతో కెపి ఎస్ రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంజనీరింగ్ ,ఫార్మసీ కాలేజీలు నెలకొల్పి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యారు. ఇక బన్నీతో పెళ్ళికి దాదాపు 100కోట్లు కట్నం రూపంలో సమర్పించుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

ఇక వీటికి తోడు సిటీలో విలువైన ఆస్తులను కుమార్తె పెళ్ళికి కానుకగా రాసి ఇచ్చాడట. అప్పట్లో అల్లు అర్జున్ తన పెళ్లిని పదికోట్ల ఖర్చుతో గ్రాండ్ గా జరుపుకున్న సంగతి తెల్సిందే. దేవలోకాన్ని తలపించేలా ఏర్పాటుచేసిన పెళ్లి వేదికపై బన్నీ, స్నేహారెడ్డి గంధర్వుల్లా మెరిసిపోయారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. షూటింగ్ లేనప్పుడు కుటుంబంతో కల్సి సైట్ సీయింగ్ లు, ఫారిన్ ట్రిప్పులతో సరదాగా గడిపేస్తాడు. అంతే కాదు పెళ్లి తర్వాత ఓ రెస్టారెంట్, ఓ స్టూడియో పెట్టి వ్యాపారంలో కూడా దూసుకు పోతున్నట్లు తెలుస్తోంది.