సమంత పెళ్లి తర్వాత చైతన్య తల్లి ఎక్కడ ఉందో… ఏమి చేస్తుందో తెలుసా?
టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటిఫుల్ కపుల్ గా ఓటెయ్యాలంటే, నాగచైతన్య ,సమంత జంటకే వేయాలి . వీరిద్దరూ లాంగ్ టైం లవ్ లో మునిగి, గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. ఇక్కడే అసలు ఎట్రాక్షన్ వచ్చింది. అదేమిటంటే నాగ చతన్య తల్లి లక్ష్మిని అందరూ చూడడం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే అప్పటిదాకా చాలామందికి ఈమె ఎలా ఉంటుందో తెలీదు. స్టార్ ప్రొడ్యూసర్ దివంగత డాక్టార్ డి రామానాయుడు కుమార్తె అయిన లక్ష్మి మొదట్లో మన్మధుడు నాగార్జునను పెళ్లాడింది. వీరిద్దరూ అమెరికాలో స్టడీస్ టైం లోనే ఒకరినొకరు ఇష్టపడినట్లు చెబుతారు. ఆలా ఏర్పడిన అనుబంధంతో పెద్దల ఇష్టంలో పెళ్లి పీటలు ఎక్కారు. అయితే నాగ చైతన్య పుట్టాక నాగ్, లక్ష్మిల మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత అమలను పెళ్లి చేసుకుని నాగార్జున సెటిల్ అయిన సంగతి తెల్సిందే. ఇక లక్ష్మి కూడా తమిళనాడు లో చాలా సంపన్న కుటుంబానికి చెందిన శరత్ విజయ రాఘవన్ అనే కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ని పెళ్లి చేసుకుంది. సుందరం మోటార్స్ అనుబంధ టీవీఎస్ అయ్యంగార్ అండ్ సన్స్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన ఆయన దాదాపు 35 ఏళ్ళపాటు వివిధ కంపెనీల్లో పనిచేసారు.
అప్పట్లో నాగ్ నుంచి విడిపోయిన లక్ష్మి ఇంటీరియర్ డెకరేషన్ ని ఉపాధిగా ఎంచుకుంది. అందుకే చెన్నైలోని ఆమె సంస్థకు భారీ ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఇక 18వ ఏట దాకా లక్ష్మి దగ్గరే నాగచైతన్య పెరిగాడు. ఎందుకంటే, చైతూని శరత్ విజయ రాఘవన్ కన్నబిడ్డల చూసుకున్నాడట. అంతే కాదు చైతూ గత ఏడాది పెళ్లి చేసుకున్నాక లక్ష్మి, శరత్ విజయ రాఘవన్ దంపతులు గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటుచేశారట.
అంతేకాదు, చైతూ నివాసం వుండే కొండాపూర్ లోని విలాసవంతమైన భవనంలో ఇంటీరియర్ డెకరేషన్ ని లక్ష్మి దగ్గర ఉండి చూసుకుంది. కొడుకు అభిరుచి, కోడలు సమంత టెస్ట్ కి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయించింది. ఇక కొడుక్కి పెళ్లయినప్పటికీ లక్ష్మి చెన్నైలోనే ఉంటోంది. ఇంటీరియర్ డెకరేషన్ లో బిజీ బిజీ గా వుండే లక్ష్మి అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి కొడుకు,కోడలు ఎలా వున్నారో చూసి వెళ్తుందట.