సోనాలి బింద్రే భర్త గురించి ఎవరికి తెలియని నమ్మలేని వాస్తవాలు
టాలీవుడ్ లో అనేక సక్సెస్ ఫుల్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సోనాలి బింద్రే ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ కి సిద్ధమైన ఆమె ప్రతి అవయవానికి మోస్ట్ డేంజరస్ మెటాస్టాటిక్ కాన్సర్ తో బాధ పడుతున్నట్టు గత కొన్ని రోజుల క్రితం గుర్తించారు. దాంతో కుటుంబంతో కల్సి అమెరికా వెళ్ళింది. క్యాన్సర్ వైద్యం కోసం ముందస్తుగా జుట్టు కూడా కత్తిరించుకుని ఎంతో ఆత్మ స్థైర్యంతో ముందడుగు వేసింది ఈ బాలీవుడ్ భామ. ఇంత తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న సొనాలికి భర్త, కుమారుడు , ఇతర కుటుంబ సభ్యుల నుంచి అపారమైన మద్దత్తు లభిస్తోంది. ముఖ్యంగా భర్త గోల్డీ బెల్ ఆమెను వెన్నంటే ఉంటున్నాడు.
సొనాలికి క్యాన్సర్ సోకిందని కుంగిపోకుండా భార్యలో ధైర్యం నింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజాన్ని అతడు మొదట షాక్ కి గురైనప్పటికీ సొనాలికి తెలియకుండా గుండె నిబ్బరం చేసుకుని,కన్నీళ్లు దిగమింగుకోవడమే కాకుండా, ఇతర కుటుంబ సభ్యులు కూడా నిబ్బరంగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక సోనాలి గురించి, ఆమె భర్త గురించి విపరీతంగా కథనాలు వస్తున్నాయి.
సోనాలి గురించి ప్రేక్షకులకు తెలిసినప్పటికీ ఆమె భర్త గోల్డీ బెల్ గురించి దక్షిణాది ప్రజలకు తెల్సింది తక్కువే. 43 ఏళ్ళ గోల్డీ బెల్ బాలీవుడ్ దర్శకుడు. కొన్ని చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్ గా,మరి కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. పలు చిత్రాలతో పాటు పాపులర్ టెలివిజన్ సీరియళ్లకు దర్శకత్వం వహించాడు. ఇక అతని బ్యాక్ గ్రౌండ్ చూస్తే అతని తండ్రి రమేష్ భాయల్ కూడా డైరెక్టరే. గోల్డీ 1974జనవరి 24న ముంబయిలో జన్మించాడు.
మెయ్ కాలేజీలో ఇంటర్ చదివిన గోల్డీ బెల్ ఆతర్వాత ఫాదర్ బాటలో సినీ రంగంలోకి ప్రవేశించాడు. ఆయనకో సోదరి కూడా ఉంది. ఆమె పేరు సృష్టి ఆర్య. ఇక సాఫ్ట్ వేర్ నిపుణులు అయినా సోదరితో కల్సి గోల్డీ చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇదంతా ఒక ఎత్తైతే సోనాలితో ప్రేమ పక్కా సినిమా స్టైల్ ని తలపిస్తుంది. మరాఠీ అమ్మాయి సోనాలి విద్యావంతుల కుటుంబంలో పుట్టడమే కాదు, బాగా చదువుకుంది. కానీ పంజాబీ ఫ్యామిలిలో పుట్టిన గోల్డీ పెద్దగా చదివింది లేదు.
ఇంటర్ మధ్యలో ఆపేసాడు. అయితే గోల్డీ బెల్ ని తమ ఇంటి అల్లుడుగా రావడానికి సోనాలి ఫ్యామిలీ మొదట్లో ఒప్పుకోలేదట. అయితే అందరినీ ఎదిరించి గోల్డీతో జీవితం పంచుకోవాలని సోనాలి నిర్ణయించుకోవడంతో 2002లో పెళ్లి అయింది. ఇక వీరికి రణవీర్ అనే 13ఏళ్ళ కుమారుడు వున్నాడు.